Share News

మహా సంబరం

ABN , Publish Date - May 28 , 2026 | 01:38 AM

టీడీపీ రాష్ట్ర మహానాడు సంబరాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా క్లస్టర్లలో తెలుగు తమ్ముళ్లు జోష్‌ నడుమ తొలిరోజు బుధవారం మహానాడు వేడుకలు సక్సెస్‌ అయ్యాయి.

మహా సంబరం
కాట్రేనిపాడులో చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షిస్తున్న మంత్రి పార్థసారథి..

మహానాడు తొలిరోజు సక్సెస్‌

73 చోట్ల స్ర్కీన్లు.. 25 వేల మంది హాజరు

నేతల దిశా నిర్దేశం.. టీడీపీ నాయకులు, కేడర్‌లో ఉరకలేసిన ఉత్సాహం

ఘనంగా ఎన్టీఆర్‌కు నివాళులు.. క్లస్టర్లలో ఏర్పాట్లను పర్యవేక్షించిన పరిశీలకులు

టీడీపీ రాష్ట్ర మహానాడు సంబరాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా క్లస్టర్లలో తెలుగు తమ్ముళ్లు జోష్‌ నడుమ తొలిరోజు బుధవారం మహానాడు వేడుకలు సక్సెస్‌ అయ్యాయి. 73 క్లస్టర్ల పరిధిలో కల్యాణ మండపాలు, కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్ల పరిసరాలు పసుపు జెండాల తోరణాల రెపరెపలతో కళకళలాడాయి. మంగళ గిరి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌, ఇతర ముఖ్య నేతల ప్రసంగాలను ఎల్‌ఈడీ స్ర్కీన్లపై వర్చువల్‌గా తెలు గు తమ్ముళ్లు, మహిళలు, యువత తిలకించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 25,000 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఏలూరు, మే 27(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం ఏలూరుతో సహా ఏడు నియోజకవర్గాల్లోను ముఖ్య నేతలు పార్టీ జెండాలను ఆవిష్కరించి, ఎన్టీ ఆర్‌కు నివాళులర్పించారు. ఉదయం 10 గంటలకు మహానాడు వేడుకలు ప్రారంభం కాగా ఎండ వేడిమి పడకుండా భారీగా టెంట్లు, కుర్చీలు వేశారు. ప్రతిచోట ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం నాన్‌వెజ్‌తో భోజనాలు, కూలింగ్‌ వాటర్‌, మజ్జిగ అందజేత తదితర సౌక ర్యాలు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల పర్యవేక్షణలో సాగాయి. ప్రతిచోట 300కు పైబడి నాయకులు, కార్యకర్తలు హాజరు కావడంతో కూలర్లను ఏర్పాటు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బడేటి చంటి ఏలూరులోని 11 క్లస్టర్లను కలియదిరగడంతో పాటు, ఉంగుటూరులో గన్ని వీరాంజనేయులు అందు బాటులో లేని కారణంగా అక్కడ ఏర్పాట్లపై భీమడోలు, గుండుగొలనుల్లో బుధవారం సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోల వరం నియోజకవ ర్గంలో పార్టీ పరిశీలకు కోళ్ల నాగేశ్వరావు, కైకలూరు నియోజవర్గంలో భీమ వరానికి చెందిన సీనియర్‌ నాయ కుడు ఘంటా త్రిమూర్తులు, రాష్ట్ర నాయ కులు కొత్త నాగేంద్రకుమార్‌ ఏర్పాట్లను పర్య వేక్షించారు. పోలవరంలో ట్రైకా ర్‌ చైర్మన్‌, బొరగం శ్రీనివాస్‌, చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగా రోషన్‌ కుమార్‌, దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌, నూజివీడులో మంత్రి కొలు సు పార్థసారథి దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుని విజయవంతం చేశారు.

యువతలో జోష్‌

స్థానిక సంస్థలకు సన్నద్దం అవుతున్న తరుణంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా యువ నాయకత్వం ఈసారి వర్చువల్‌ మహానాడులో కీలక పాత్రను పోషించారు. కార్యకర్తలకు, నాయకులకు చేదోడు వాదోడుగా ఉంటూ మహానాడు వేదికలపై సందడి చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ ప్రసం గాలకు మహిళలు, యువత, నేతలు సైతం కేరింతలు కొట్టారు. రెండోరోజూ జిల్లా అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కార్యకర్తలకు పెద్దపీట : టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి

ఏలూరు టూటౌన్‌ : ఏలూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మహా నాడు నిర్వహించారు. నియోజకవర్గంలోని 11 క్లస్టర్స్‌లో నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన అనంతరం మాజీ సీఎం ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తల పార్టీ అన్నారు. పార్టీ పరిశీలకులు మీరావలి, మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు, జిల్లా మీడియా కోఅర్డినేటర్‌ చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు, టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు చోడే వెంకటరత్నం, రెడ్డి నాగ రాజు, సీనియర్‌ నేతలు ఉప్పాల జగదీశ్‌బాబు, బెల్లకొండ కిషోర్‌, కార్పోరేటర్లు, క్లస్టర్‌, డివిజన్‌ ఇన్‌చార్జ్‌లు, పాల్గొన్నారు.

భావితరాల సంక్షేమ వేదిక మహానాడు : మంత్రి కొలుసు

నూజివీడు/ముసునూరు : నూజివీడు నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి నూజి వీడులో పోతిరెడ్డిపల్లి జంక్షన్‌లో గల ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సైకిల్‌ తొక్కుతూ పైడి అప్పారావు కిరాణా మర్చంట్‌ అసోసియషన్‌ హాలులో మహానాడుకు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వివాన్‌ ఫంక్షన్‌ హాల్లో మహా నాడు కార్యక్రమాన్ని పార్టీ జెండా ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ భవిష్యత్‌ తరాల గురించి టీడీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంటే మారీచుడిలా మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకుంటున్నాడని విమర్శించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు జగదీష్‌, మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ దుర్గాప్రసాద్‌, విజయ్‌, పి.నాగరాజు, మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొ న్నారు. ముసునూరు మండలంలోని చెక్కపల్లిలో పర్వతనేని బాలగంగాధర్‌ (బాజ్జి) ఇంటి ప్రాంగణం, కాట్రేనిపాడులో మొక్కజొన్న కంపెనీ ప్రాంగణా ల్లో జరిగిన మహానాడు వేదికల వద్ద మంత్రి పార్థసారథి పాల్గొని ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాలను ఆవిష్క రించారు. మండల టీడీపీ అధ్యక్షుడు గద్దె రఘుబాబు, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు సూర్యదేవర శ్రీనివాసరావు, తల్లిబోయిన సత్యనారాయణ, గ్రామపార్టీల అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ ఒక మహాకుటుంబం : ఎమ్మెల్యే ప్రభాకర్‌

పెదవేగి/పెదపాడు : పార్టీ జండా, అజెండా కార్యకర్తల అభివృద్ధి అని, పార్టీ బలం కార్యకర్తలేనని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. దెందులూరు నియోజకవర్గంలోని 11 క్లస్టర్ల పరిధిలో డిజిటల్‌ వేదికగా జరుగుతున్న మహానాడును ప్రత్యక్షంగా వీక్షించడానికి అనువుగా 11చోట్ల భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. అన్నిచోట్లకు తిరిగిన ఎమ్మె ల్యే కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. కార్యకర్తలకు అసౌకర్యం కలుగ కుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయడంతోపాటు రొయ్యలు, చికెన్‌తో ధమ్‌ బిర్యానీ లు, చేపల వేంపుడు, కర్రీలు, ఎగ్‌బోండాలతో పాటు వెజ్‌ వంటకాలు, ఆవకాయ పచ్చళ్లు, నోరూరించే నూజివీడు రసాలతో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. పెదవేగి మండలం అమ్మపాలెం, విజయరాయి, రాట్నాలకుంట, కూచింపూడి గ్రామాల్లో నాలుగుచోట్ల మహానాడు డిజిటల్‌ కార్యక్రమాలు నిర్వహించారు. కూచింపూడిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తల అండదండలే టీడీపీ బలమన్నారు. పార్టీ నాయకులు బొప్పన సుధాకర్‌, ఈడ్పుగంటి అనిల్‌, తాతా సత్య నారాయణ, మంచినేని శ్రీనివాసరావు, కొనకళ్ల శివమణి, అయినాల వెంకట నారాయణ, పార్టీ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పెదపాడు మండలంలోని 8, 9, 10వ క్లస్టర్లు వట్లూరు, పాతపెదపాడు, వసంతవాడ గ్రామాల్లో మహానాడు సమావేశాలు క్లస్టరు ఇన్‌చార్జిలు ఉప్పల పాటి రాంప్రసాద్‌, గుత్తా అనిల్‌, మందపాటి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో జరిగాయి. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసిన ఎమ్మెల్యే చింతమనేని పార్టీ సిద్ధాంతాల ప్రకారం కార్యకర్తకు తగిన ప్రాధాన్యతని వ్వడం జరిగిందన్నారు. కార్యకర్తలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఏఎంసీ చైర్మన్‌ గారపాటి రామ సీత, మండల పార్టీ అధ్యక్షుడు మరడాని రవి తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి : ఎమ్మెల్యే రోషన్‌

చింతలపూడి/లింగపాలెం : చింతలపూడి ఆర్‌కే కన్వెన్షన్‌లో నియోజకవర్గ మహానాడు పరిశీలకుడు రావి వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేయగా, యర్రగుంటపల్లి క్లస్టర్‌ రాధాగార్డెన్‌లో ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ టీడీపీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాల న్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, మండల శాఖ అధ్య క్షుడు సి.హెచ్‌.విష్ణు, పట్టణ శాఖ అధ్యక్షుడు టి.అప్పారావు, మాజీ సర్పంచ్‌ చిట్లూరి ధర్మరాజు, మాజీ జడ్పీటిసి తాళ్ళూరి రాధారాణి పాల్గొన్నారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం, రంగాపురం గ్రామాల్లో మహానాడు కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మాజీగూడెం కార్యక్రమానికి ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌, నియోజకవర్గ పరిశీలకులు రావి వెంకటేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ ముఖ్యఅథితులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మండల అధ్యక్షుడు గరిమళ్ల చలపతిరావు, గుత్తా సత్యసాయివరప్రసాద్‌, మోరంపూడి ప్రసాద్‌, నిమ్మగడ్డ సుధాకర్‌, పల్లి శ్రీను, వేంపాటి ప్రసాద్‌, ముసునూరి రాము, గారపాటి బుజ్జయ్య, పాతూరి శ్రీను, వెంకటేశ్వరావు, శౌరి, నందిగం సీతారామ తిలక్‌ పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా రు.

Updated Date - May 28 , 2026 | 01:38 AM