Share News

అరగంట ముందే గేట్లు క్లోజ్‌

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:01 AM

జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ (ఐఐటీ, ఎన్‌ఐటీ) ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్స్‌ తొలివిడత పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి.

అరగంట ముందే గేట్లు క్లోజ్‌

ఏలూరు అర్బన్‌, జనవరి 20(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ (ఐఐటీ, ఎన్‌ఐటీ) ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్స్‌ తొలివిడత పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 29 వరకు జరిగే ఈ పరీక్షలు జిల్లాకు ఏలూరులో సిద్ధార్థ క్వెస్ట్‌ సీబీఎస్‌ఈ స్కూలు పరీక్ష కేంద్రానికి 1,670 మంది అభ్యర్థులు, సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల పరీక్ష కేంద్రానికి 1,650 మందిని కేటాయించారు. పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా ముందస్తు పర్యవేక్షణ నిమిత్తం మంగళవారం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ట్రయల్‌ రన్‌ ద్వారా డమ్మీ పరీక్షను టీసీఎస్‌ నిర్వహించింది. నిబంధనల ప్రకారం జాతీయ పరీక్షలకు పరీక్ష ప్రారంభ సమయానికి అరగంట ముందుగానే ఎగ్జామ్‌ సెంటర్‌ మెయిన్‌ గేట్‌ను మూసివేస్తున్నం దున అభ్యర్థులు ఉదయం సెషన్‌ పరీక్షకు 8.30 గంటల్లోగా, మధ్యాహ్నం సెషన్‌ పరీక్షకు 2.30 గంటల్లోగా పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఉదయం సెషన్‌ పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌ పరీక్ష 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. రెండు గంటల ముందుగానే అభ్యర్థుల ను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రెండు పరీక్ష కేంద్రాలకు జేఈఈ మెయిన్స్‌ సిటీ కో–ఆర్డినేటర్‌గా సాయికుమారి శంకర్‌ను నియమించారు.

అభ్యర్థులకు సూచనలు

పరీక్ష కేంద్రంలోకి అరగంట ముందుగానే వెళి ్లపోవాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను అనుమ తించరు. హాల్‌టిక్కెట్‌, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం, ఫొటో గుర్తింపు కార్డులతో పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. అటెం డెన్సు షీటుపై అతికించేందుకు ఒక అదనపు పాస్‌ పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి. సాధారణ పెన్‌, వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లవచ్చు. తప్పనిసరిగా ఫార్మల్‌ దుస్తులను ధరించాలి. పరీక్షార్థులకు సహాయ పడేందుకు ఫోన్‌ నంబర్లు 011–40759000, 69227700 లతో జేఈఈ మెయిన్స్‌ నిర్వహణ సంస్థ ఎన్టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) ఏర్పాటుచేసింది.

Updated Date - Jan 21 , 2026 | 01:02 AM