Share News

వీడని గ్యాస్‌ కష్టాలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:32 AM

పశ్చిమా సియాలో ఏర్పడిన యుద్ధ ఘర్షణల నేపథ్యంలో దేశంలో గ్యాస్‌, ఇతర ఆయిల్‌ సరఫరాపై ఏర్పడిన ఒత్తిడితో జిల్లాలో వివిధ కేటరింగ్‌, చిన్న చిన్న హోటల్స్‌ నిర్వాహకులు ప్రత్యామ్నాయ వనరులతో కేటరింగ్‌, టిపిన్‌ సెంటర్ల నిర్వహణకు సిద్ధమయ్యారు.

వీడని గ్యాస్‌ కష్టాలు

పెరిగిన కట్టెలు, ఊక ధరలు

ఇంకా దొరకని వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు

కిలో కట్టెలు రూ.5 నుంచి రూ.15కు పెంపు.. టిఫిన్‌ సెంటర్ల మూత

తణుకు రూరల్‌/ద్వారకాతిరుమల, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పశ్చిమా సియాలో ఏర్పడిన యుద్ధ ఘర్షణల నేపథ్యంలో దేశంలో గ్యాస్‌, ఇతర ఆయిల్‌ సరఫరాపై ఏర్పడిన ఒత్తిడితో జిల్లాలో వివిధ కేటరింగ్‌, చిన్న చిన్న హోటల్స్‌ నిర్వాహకులు ప్రత్యామ్నాయ వనరులతో కేటరింగ్‌, టిపిన్‌ సెంటర్ల నిర్వహణకు సిద్ధమయ్యారు. కట్టెలు, ఊక ధరలు వారం రోజుల్లో పెరిగాయి. వాణి జ్య గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో చాలా వరకూ రోడ్డు పక్కన నిర్వహించే టిఫిన్‌ సెంటర్లు మూత పడగా, కొందరు కరెంట్‌ పొ య్యిలు, కట్టెల పొయ్యిలపై వంటలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారం క్రితం కిలో రూ. 6 వున్న కట్టెలు, ఈ రోజు కిలో రూ.15లుగా కొనుగోలు చేస్తు న్నారు. ఒక కేటరింగ్‌ సంస్థ 100 మందికి వంట చేయాలంటే 70 కిలోల కట్టెలు అవసరం. ఈ లెక్కన కేటరింగ్‌ ధరలు పెంచేశారు. ఈ భారం అంతిమంగా వినియోగ దారులపైనే పడుతోంది. కొందరు బండ్లపై టిఫిన్‌ సెంటర్లు నిర్వహించే వారు కట్టెల పొయ్యలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిద్దామన్నా అందుకు సరైన స్థలాలు లేకపోవడంతో మూసేశారు. మరికొం దరు కరెంట్‌ స్టౌవ్‌లను ఉపయోగించి టిఫిన్‌ సెంటర్లను కొనసాగిస్తున్నారు.

సిలిండర్‌ ఇస్తేనే వంటలు...

శ్రీరామ నవమి పర్వదినం ముగియడంతో జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్లసీజన్‌ ఊపందుకుంది.. పెళ్లిళ్ల నిర్వ హణ కంటే వచ్చిన వారికి భోజనాలు పెట్టడం ప్రస్తుతం నిర్వాహకులకు పెద్ద సవాలుగా మారింది. వంట గ్యాస్‌ సరిగా దొరక్కపోవడమే ఇందుకు కారణం. అలాగే క్యాటరింగ్‌ నిర్వాహకులు గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తేనే క్యాట రింగ్‌ చేస్తాము అని తెగేసి చెప్పడంతో పెళ్లిపెద్దలు బిత్తరపోతున్నారు. పెళ్లి బృందాలను ఈ గ్యాస్‌కొరత అయోమయంలో పడే స్తోంది. యుద్ధతీవ్రత పెరుగుతు ండటంతో గ్యాస్‌ లభ్యతపై ఎన్నో సందేహాలు వెల్లివెత్తు తున్నాయి. కమర్షియల్‌ సిలిండర్ల లభ్యత కష్టతరం కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలు హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. మరి కొందరు కట్టెల పొయ్యిల ఆధారంగా అరకొరగా వ్యాపా రాలు చేస్తున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి మరీ కట్టెల పొయ్యిలను కొనుగోలు చేస్తున్నారు.

గ్యాస్‌ సిలిండర్‌ దొరకడం గగనమే

గ్యాస్‌ బుక్‌ చేసుకున్నా సిలిండర్‌ దొరకడం గగన ంగా మారింది. ఏజన్సీలకు వచ్చే లోడు సంఖ్య తగ్గింది. అయితే గ్యాస్‌ ఏజన్సీకి లోడు వచ్చిందని తెలిస్తే వందలాదిగా ప్రజలు అక్కడ గుమిగూడుతున్నారు. కొందరైతే ఈ బాధలు పడలేక సిలిండర్‌ను రూ. 1500లకు బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు.

కట్టెలకు యమ డిమాండ్‌

కొందరు ధనవంతులు, వ్యాపారులు గ్యాస్‌ ఇబ్బం దులు తాళలేక బ్లోయర్‌ పొయ్యిల కొనుగోలుకు ఆసక్తి చూపతున్నారు. ఈక్రమంలో విజయవాడ, రాజమహే ంద్రవరం తదితర ప్రాంతాల నుంచి ఒక్కో కట్టెల పొయ్యిని రూ.20 నుంచి 25 వేలు వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. కొందరైతే మట్టితో పొయ్యిల నిర్మాణం చేసుకుంటూ తంటాలు పడుతున్నారు. దీంతో క ట్టెలకు సైతం మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఆటోపుల్లల రేటు రూ.3వేలు వరకూ ఎగబాకింది.

శ్రీవారి నిత్యాన్నదానానికీ.. గ్యాస్‌ సెగ

శ్రీవారి వకుళమాత నిత్యాన్నదాన సదనంలో ప్రతి రోజూ వేలాదిమంది భోజనం చేస్తుంటారు. అయితే గ్యాస్‌కొరత వారినీ వేధిస్తుంది. దాన్ని అధిగమించేం దుకు దేవస్థానం ఎన్నో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు కట్టెలను మండించి వచ్చే స్టీమ్‌ ద్వారా వంటలు చేయిస్తున్నారు. మరికొన్ని వంటకాలను బ్లోయర్‌ కట్టెల పొయ్యితో వండిస్తున్నారు.

కేటరింగ్‌కు సిలిండర్‌ ఇవ్వాల్సిందే

పెళ్లిళ్ల సీజన్‌లో గ్యాస్‌ కొరత ఏర్పడటంతో అటు నిర్వాహకులతో పాటు ఇటు క్యాటరింగ్‌ వారూ తల లు పట్టుకుంటున్నారు. నాలుగు డబ్బులు సంపాదిం చుకునే సమయంలో ఇటువంటి అడ్డంకులు ఏమిట ంటూ వాపోతున్నారు. ఇక వరుసగా ఉన్న వివాహాది శుభకార్యాల ముహూర్తాల సమయంలో ఏం చేయా లంటూ ఆవేదన చెందుతున్నారు. మే1, 6 నుంచి 11వరకు, జూన్‌ 17నుంచి 20, 24, 25,27, 28, 29, జూలై 1 నుంచి 6, 8, 9 వరకూ మంచి ముహూ ర్తాలున్నాయి. ఇప్పటికే చాలా వరకు గదులు, కల్యా ణ మండపాలు బుక్‌ అయ్యాయి. అయితే క్యాట రింగ్‌ కోసం వెళుతున్న పెళ్లి జనాలకు వ్యాపారుల నుంచి చుక్కెదురు అవుతోంది. సిలిండర్‌లను తమకు సరఫరా చేస్తేనే వంటలు చేసి ఇవ్వగలమని కొందరు తెగేసి చెబుతున్నారు. మరి కొందరు ప్రత్యమ్నాయాల ద్వారా వంటలు చేసి పెట్టేందుకు ఒప్పుకుంటున్నారు.

గ్యాస్‌ బండలు చోరీ.. వినియోగదారుల లబోదిబో

భీమవరం క్రైం, మార్చి 31(ఆంధ్రజ్యోతి):ఓ వైపు గ్యాస్‌ కొరతతో వినియోగదారులు నానా అవస్థలు పడుతుంటే.. మరోవైపు సిలిండర్ల డిమాండ్‌ కారణంగా దొంగలు విజృంభిస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్‌ కనబడిందా ? ఇకంతే సంగతులు. ఇట్టే చోరీ చేసేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ మంది బ్లాక్‌ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో దొంగలు సిలిండర్లను దొంగతనం చేసి బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో సిలిండర్‌ రూ.2,500 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తూ ఉండటంతో దొంగల దృష్టి గ్యాస్‌పై పడింది.గతంలో బంగారం, వెండి, నగదు జాగ్రత్త పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్లు దాచుకోవాల్సి వస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.

భీమవరంలో రోడ్డు పక్క హోటల్‌ యజమాని మధ్యాహ్న సమయంలో భోజనానికి వెళ్లారు. ఒక గంట తర్వాత వచ్చి చూసేసరికి హోటల్‌లో వున్న రెండు గ్యాస్‌ సిలిండర్లు మాయమయ్యాయి.

ఆకివీడు ప్రాంతంలో ఒక కుటుంబం ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లింది. వారి బాల్కానీలో ఉన్న రెండు గ్యాస్‌ సిలిండర్లు దోచుకెళ్లిపోయారు.

మూడు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌ వ్యానులో సిలిండర్లు తీసుకువచ్చి ఒక ఇంటి వద్ద మేడపైకి వెళ్లి గ్యాస్‌ ఇవ్వడానికి వెళ్లారు. వచ్చేసరికి వ్యానులో ఉన్న మూడు సిలిండర్లు దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ డెలివరీ బాయ్‌ లబోదిబోమన్నాడు.

ఒక రోజు క్రితం తాడేపల్లిగూడెం కరకట్ట ప్రాంతంలో ఒక వృద్ధురాలు ఇంటికి తాళం వేసి ఊరు వెళ్ళింది. వచ్చేసరికి ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలెండర్‌ ఎత్తుకెళ్లారు. తనకు వంట చేసుకోవడానికి గ్యాస్‌ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గ్యాస్‌ను ఇలా పొదుపు చేద్దాం

గణపవరం, మార్చి 31(ఆంధ్రజ్యోతి):గ్యాస్‌ కొరత ప్రజలను పట్టిపీడిస్తోంది. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. బ్లాక్‌ మార్కెట్‌లో సిలిండర్ల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వాలు చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో గ్యాస్‌ సరఫరాకు పొంతన ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో వంట గ్యాస్‌ పేద, మధ్య తరగతి కుటుంబానికి పెనుభారంగా మారుతోంది. వినియోగదారులు గ్యాస్‌ వాడకంలో జాగ్రత్తలు పాటిస్తే కాస్త ఇబ్బందులు తొలగుతాయి.

గ్యాస్‌ వాడకంలో మెలకువలు.

గ్యాస్‌ వెలిగించాక వంటపాత్ర, కావాల్సిన పదార్థాల కోసం వెతకటంతో మంట వృథా అవుతుంది. ముందుగానే అన్ని పదార్థాలు అందుబాటులో పెట్టుకోవాలి.

స్టౌవ్‌పై ఉడికించే పదార్థాలకు ప్రెషర్‌కుక్కర్‌ వినియోగిస్తే 40 శాతం గ్యాస్‌ ఆదా అవుతుంది.

పెద్దపెద్ద పాత్రలు, మూతలేనివి వినియోగిస్తే ఎక్కువగా వేడి అవసరమవుతుంది. గంటకు 7.2 శాతం గ్యాస్‌ కోల్పోతారు. తగిన మూతలు ఉంటే గంటకు 1.45 శాతం ఆదా అవుతుంది.

బియ్యం, పుప్పు దినుసులు అరగంట ముందే నానబెడితే 22 శాతం గ్యాస్‌ ఆదా అవుతుంది. పదార్థాలు ఉండగానే మంట తగ్గించాలి.

సాధారణ స్టౌవ్‌ ఉపయోగిస్తే 17 శాతం గ్యాస్‌ అధికంగా ఖర్చవుతుంది.

ఐఎస్‌ఐ మార్కు కలిగిన గ్రిన్‌లేబుల్‌ గ్యాస్‌ స్టౌవ్‌లు ఉపయోగిస్తే మంచిది.

స్టౌవ్‌ బర్నల్‌, మసిపట్టిన పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. తక్కువ ఆహార పదార్థాలు వండేందుకు చిన్న బర్నర్‌ వినియోగిస్తే 6 – 10 శాతం గ్యాస్‌ తక్కువ వినియోగం అవుతుంది.

Updated Date - Apr 01 , 2026 | 12:32 AM