Share News

ఇంటింటికీ గ్యాస్‌పై కదలిక!

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:05 AM

ఇరాన్‌ యుద్ధంతో గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్న నేపథ్యంలో పశ్చిమలో ఇంటింటికి గ్యాస్‌ పథకంలో కదలిక వచ్చింది.

ఇంటింటికీ గ్యాస్‌పై కదలిక!
ఒక ఇంటికి బిగించిన గ్యాస్‌ పైప్‌ లైన్‌

ఇంటింటికీ గ్యాస్‌పై కదలిక!

తాడేపల్లిగూడెంలో అమలుకు చర్యలు.. 109 ఇళ్లకు సరఫరా

మరో 9,902 మందికి అందించేందుకు చర్యలు

సఫలీకృతమైతే మిగతా పట్టణాల్లో అమలు

భీమవరం టౌన్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ఇరాన్‌ యుద్ధంతో గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్న నేపథ్యంలో పశ్చిమలో ఇంటింటికి గ్యాస్‌ పథకంలో కదలిక వచ్చింది. గత టీడీపీ హయాంలో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ఉమ్మడి జిల్లాలో అమలు చేసేందుకు గోదావరి గ్యాస్‌ ఏజెన్సీకి అప్పగించారు. దీంతో పట్టణాల మీదుగా గ్యాస్‌ సరఫరా కోసం పైపులైన్‌లు వేయడంతో పాటు భీమవరం, తణు కు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో చాలావరకు ఇంటింటికి గ్యాస్‌ కనె క్షన్‌లు ఏర్పాటుచేశారు. తర్వాత వైసీపీ ప్రభు త్వం రావటంతో ఈ పథకం కొంత వెనుకబ డింది. అప్పట్లో గ్యాస్‌ కొరత లేకపోవటంతో ప్రజల నుంచి ఇంటింటికి గ్యాస్‌కు సంబంధిం చి అంతగా స్పందన లేదు. ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో గ్యాస్‌ సరఫరా తగ్గటంతో గ్యాస్‌ కష్టాలను తగ్గించటంతోపాటు ఎల్‌పీజీపై ఒత్తి డి తగ్గేలా ఇంటింటికి గ్యాస్‌ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

తాడేపల్లిగూడెం నుంచి ప్రారంభం..

తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించి ఇప్పటికే ఇంటింటికి గ్యాస్‌ను దాదాపు 109 ఇళ్ళకు ప్రత్యేక ట్యాంకర్‌ ద్వారా అందిస్తున్నా రు. గ్యాస్‌ ట్యాంకర్లు ఏర్పాటుకు కొండ్రుప్రో లు ప్రాంతంలో స్థలం కేటాయించారు. స్థల ఇబ్బందుల నేపథ్యంలో పనులు నిలిచాయి. అయితే ప్రస్తుతం 109 ఇళ్లకు ట్యాంకర్‌ ద్వారా అందిస్తున్న నేపథ్యంలో మరింతమంది ఉప యోగించుకునేలా అవగాహన కార్యక్రమాల ను చేపట్టనున్నారు. గతంలో 9 వేల 902 మంది పీఎన్‌జీ కనెక్షన్‌ తీసుకునేందుకు ముం దుకు వచ్చారు. తరువాత పట్టించుకోకపోవటంతో వారు ముందుకు రాలేదు. ఇప్పుడు వారిపై దృష్టి పెట్టారు. వార్డు, సచివాలయ, మెప్మా సిబ్బందితో గతంలో దరఖాస్తు చేసుకునే వారికి అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం వాడుతున్న గ్యాస్‌ కనెక్షన్‌కు బదులుగా పీఎన్‌జీ గ్యాస్‌ వాడుకుంటామని అంగీకారపత్రం అందించాల్సి ఉం టుంది. ఆ తరువాత గ్యాస్‌ సిలిండర్‌, రెగ్యులేటర్‌ కంపెనీలకు అందించిన తరువాత ఇంటింటి పైపు ద్వారా గ్యాస్‌ అందిస్తారు.

పౌర సరఫరాల కమిషనర్‌ సమీక్ష..

ఇంటింటికి గ్యాస్‌ పంపిణీపై ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కన్నబాబు జాయింట్‌ కలెక్టర్లు, డీఎస్‌ఓలు, గ్యాస్‌ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వెనుకబాటుతనంపై పరిస్థితి ఆరాతీశారు. గ్యాస్‌ ఏజెన్సీల సమస్యపై సంబంధిత అధికారులతో చర్చించారు. పశ్చిమకు సంబంధించి టీపీ గూడెంపై ప్రత్యేక దృష్టిపెట్టి పూర్తిస్థాయిలో విజయవంతమైతే మిగతా పట్టణాలపై దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. దీంతో జిల్లా అధికారులు పట్టణంపై ఫోకస్‌ పెట్టారు.

తేతలిలో స్థలం సిద్ధం..

తణుకు పట్టణానికి సంబంధించి తేతలిలో ఇప్పటికే స్థలం కేటాయించారు. గోదావరి గ్యాస్‌ ఏజెన్సీ ట్యాంకర్లు ఏర్పాటు చెయ్యవలసి ఉంది. అక్కడ మెయిన్‌ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ అందుబాటులోకి వస్తే తణుకు పట్టణంలో ఇంటింటికి గ్యాస్‌ పైపులైన్‌లు ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. భీమవరం, పాలకొల్లు, నరసాపురం పట్టణాలకు సంబంధించి ఇంకా ఎటువంటి ప్రస్థావన లేదు.

ఎల్పీజీ మాదిరిగానే సబ్సిడీ..?

ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌లకు ఎటువంటి రాయితీని ప్రభుత్వం అందిస్తోందో పీఎన్‌జీ గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకున్నవారికి సబ్సిడీ ఇచ్చే విషయంలో ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.

Updated Date - Jun 14 , 2026 | 01:05 AM