సొసైటీలకు పూర్వవైభవం తీసుకొస్తాం
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:36 AM
కూటమి ప్రభుత్వంలో సహకార సంఘాలకు పూర్వవైభవం తీసుకొస్తా మని డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనే యులు అన్నారు.
డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు
ఏలూరు, మార్చి 12(ఆంఽధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో సహకార సంఘాలకు పూర్వవైభవం తీసుకొస్తా మని డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనే యులు అన్నారు. ఏలూరు నగరంలోని డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ అధ్యక్షతన మహాజన సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2026–27 ఆర్థిక సంవత్సరం డీసీఎంస్ బడ్జెట్‌ను, సంఘం నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌ఛార్జి చైర్మన్ అనుమతితో ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దశలవారీగా సమస్యలను అధిగమించి, నష్టాలు నుంచి లాభాల బాట పట్టిస్తున్నామన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్ధితో పాటు సహకార సంఘాలు బలోపేతమయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. రైతుల కోరిక మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మేలు జరిగేలా చూస్తామన్నారు. డీసీసీబీ సీఈవో జి సింహాచలం, డీసీవో ఆరిమిల్లి శ్రీనివాస్, డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి కె.సత్యవతి, బిజినెస్ మేనేజర్ వెల్లంకి శివకృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు నిర్ణయం
డీసీసీబీ పరిధిలో పదేళ్ల పైబడి దీర్ఘకాలిక రుణాలు తీసుకుని చెల్లించలేని స్థితిలో ఉన్న రైతులు, సభ్యులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అమలు చేయాలని డీసీసీబీ మహాజన సభ తీర్మానించింది. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ త్వరలో విధి విధానాల రూపకల్పన చేసి అమలు చేస్తామన్నారు.