Share News

దమ్‌ మారో..దమ్‌!

ABN , Publish Date - May 18 , 2026 | 12:01 AM

ఏలూరు జిల్లాలో గత పరిస్థితులను పరిశీలిస్తే ఎంతో మంది డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు గంజా యికి బానిసలై పోలీసు కేసుల్లో చిక్కుపడ్డారు. ఒకనా డు గంజాయి తాగుతూ దానికి బానిసలై.. తర్వాత వారే విశాఖ, ఒడిశా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజా యిని తీసుకువచ్చి విక్రయదారులుగా మారిపోతు న్నారు.

 దమ్‌ మారో..దమ్‌!

యథేచ్ఛగా గంజాయి విక్రయాలు.. వినియోగం

చెడు సావాసాలతో దారి తప్పుతున్న యువత.. పోలీసుల ఉక్కుపాదం

మత్తులో వున్న వారికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు.. చిక్కితే కటకటాల వెనక్కే

గంజాయి కేసుల్లో వున్న ఎనిమిది మందిపై పీడీ యాక్టు..

ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే జిల్లా బహిష్కరణ..

మత్తుకు బానిసలైన వారికి డి అడిక్షన్‌ సెంటర్‌లో కౌన్సెలింగ్‌

(ఏలూరు క్రైం–ఆంధ్రజ్యోతి):

ఒకప్పుడు కుటుంబంలో ఎవరైనా సిగరెట్టు, చుట్ట, బీడీ, కల్లు, సారా తాగారని తెలిస్తే కుటుంబ పెద్ద మందలించేవారు. వీరికి భయపడి అటువైపు వెళ్లడానికి సాహసించే వారు కాదు. కాని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం తో వ్యక్తి స్వేచ్ఛ పెరిగింది. గజిబిజి వాతావరణంలో ఏం చేస్తున్నామో తెలియక కొందరు, మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి మరికొందరు, సరదాకి ఇంకొందరు.. రకరకాల కారణాలతో అనేక మంది చెడు అలవాట్ల వైపు పరుగులు తీస్తూ మద్యానికి, మత్తు పదార్థాలకు, మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు, పోలీసులతోపాటు సమాజం దృష్టిపెట్టాలి.

ఏలూరు జిల్లాలో గత పరిస్థితులను పరిశీలిస్తే ఎంతో మంది డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు గంజా యికి బానిసలై పోలీసు కేసుల్లో చిక్కుపడ్డారు. ఒకనా డు గంజాయి తాగుతూ దానికి బానిసలై.. తర్వాత వారే విశాఖ, ఒడిశా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజా యిని తీసుకువచ్చి విక్రయదారులుగా మారిపోతు న్నారు. ఏలూరు సమీపంలోని పలు ఇంజనీరింగ్‌ కళా శాలల విద్యార్థులు పోలీసులకు చిక్కి కటకటాల పాల య్యారు. గంజాయి తాగే వారికి మాత్రం పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించి డి అడిక్షన్‌ సెంటర్లకు పంపి స్తూ వారి జీవితాలను బాగు చేస్తున్నారు. జిల్లాలో గంజాయిని నిర్మూలనకు ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. మరోవైపు ఈగల్‌ ఐజీ ఎ.రవికృష్ణ ఆదేశాలతో జిల్లాలో ఈగల్‌ టీమ్‌లు తమ దైన శైలిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ యువ తను చెడుద్రోవ పట్టకుండా ప్రయత్నాలు కొనసాగి స్తున్నారు.

లిక్విడ్‌ రూపంలో సేవిస్తూ..

కొందరు అల్లరిచిల్లరగా తిరిగే యువత గంజాయికి బానిసలై వారే ఒడిశా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజా యిని తీసుకువచ్చి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక ప్యాకెట్‌ 500 రూపాయలు వంతున విక్రయిస్తున్నారు. ఇలాంటి వారిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి తాగే విధానంలో కొత్తరకాన్ని అలవాటు చేస్తున్నారు. లిక్విడ్‌ రూపంలో గంజాయిని పీల్చడం ద్వారా క్షణాల్లో మత్తులోకి జారిపోవచ్చని చూపిస్తు న్నారు. ఇదే విషయాన్ని ఏలూరులో ఇటీవల ఇలాంటి ఐదుగురు ముఠా సభ్యులను టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేసిన సమయంలో చెప్పడంతో వీరు అవాక్క య్యారు. అలాంటి గంజాయి మత్తులో ఉన్న వారు ఏమి చేస్తారో వారికే తెలియదని ఆ మత్తు 24 గంటల పాటు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇది ఆందోళన కలిగించే అంశం. దీనిపై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

డీ అడిక్షన్‌ సెంటర్లు

డీ అడిక్షన్‌ సెంటర్ల ద్వారా గంజాయి తాగడం మా న్పించేందుకు ఏలూరు ప్రభుత్వాసుపత్రి, ఆశ్రం ఆసు పత్రిలో కౌన్సెలింగ్‌ సెంటర్లు ఉన్నాయి. గంజాయి సేవి స్తున్న వారిని తల్లిదండ్రులు, స్నేహితులు పోలీసులకు సమాచారం ఇస్తే.. వారికి ఈ డీ అడిక్షన్‌ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించడానికి ప్రత్యేక బృందాల ను ఏర్పాటుచేశారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచేలోపు గంజాయి ముఠాలను కటకటాలపాలు చేయడానికి నిఘా పెంచారు.

ర్యాపిడ్‌ టెస్ట్‌తో పట్టేస్తారు

గంజాయి నిర్మూలనకు, తాగే వారి కట్టడికి పోలీస్‌ శాఖ కొత్త ప్రణాణిక సిద్ధం చేసింది. ఇప్పటి వరకు మద్యం తాగి వాహనాలు నడిపే వారిని బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలు చేసి వారు ఎంత మద్యం తాగారో వారిలో ఎంత శాతం ఆల్కాహాలు ఉందో తెలియజేసే బ్రీత్‌ ఎనలైజర్లు చెబుతున్నాయి. డ్రంకన్‌ అండ్‌ డ్రెవ్‌ కేసులు నమోదు చేస్తున్నారు. అదే విధంగా గంజాయి తీసుకున్నాడని అనుమానం కలిగితే. వారి మూత్రాన్ని ర్యాపిడ్‌ టెస్ట్‌ (ఇమ్యునోక్రోమాటో గ్రాఫిక్‌ ఎనాలసిస్‌) ద్వారా ఎంత శాతం గంజాయి మత్తు అతని శరీరంలో ఉందో పసిగడతారు. ఇప్పటికే ఇలాంటి స్ర్టిప్‌లు జిల్లా పోలీస్‌ స్టేషన్లకు చేరాయి. రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే కచ్చితంగా వారు మద్యం సేవించినా, మత్తుపదార్ధాలు సేవించినా కచ్చితంగా బ్రీత్‌ ఎనలైజర్‌, గంజాయి ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. పదేపదే రౌడీ కార్యకలాపాలకు, గంజాయి కేసుల్లో ఉన్న ఎనిమిది మందిపై పీడీ యాక్టు అమలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అక్కడి నుంచి అనుమతి రాగానే వీరిని జిల్లా నుంచి బహిష్కరిస్తారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఏలూరు సబ్‌ డివిజన్‌లో ఇప్పటి కే ఎనిమిది మందిపై పీడీ యా క్టు నమోదు చేసి జిల్లా బహిష్క రణకు ప్రభుత్వ అనుమతికి సిఫారసు చేశాం. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. విద్యార్థులు స్నేహితుల ద్వారా సరదాకైనా మత్తు పదా ర్థాలు తీసుకోవద్దు. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. గంజాయికి బానిసలైన వారి సమాచారం ఇస్తే డీ అడి క్షన్‌ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్‌ ఇస్తాం. గంజాయిపై సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం.

– డి.శ్రావణ్‌కుమార్‌, ఏలూరు డీఎస్పీ

Updated Date - May 18 , 2026 | 12:01 AM