ఫుల్ జోష్!
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:28 AM
ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో కూటమి రెండేళ్ల పాలనపై మంగళవారం జరిగిన అన్నదాత– సుఖీభవ సభ మూడు పార్టీల కేడర్‌లో జోష్ నింపింది.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం
అధిక ఆదాయం దిశగా అడుగులు
జిల్లాను టాప్–3లోకి తీసుకెళ్తాం
అన్నదాత సుఖీభవ సభలో మంత్రి నాదెండ్ల
అభివృద్ధిపై ఎక్కడకైనా చర్చకు సిద్ధం : కొలుసు
సభకు భారీ స్పందన.. వేలాదిగా రైతుల హాజరు
ఏలూరు/ఏలూరు టూటౌన్, జూన్ 16(ఆంధ్రజ్యోతి):
ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో కూటమి రెండేళ్ల పాలనపై మంగళవారం జరిగిన అన్నదాత– సుఖీభవ సభ మూడు పార్టీల కేడర్‌లో జోష్ నింపింది. ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా ఉక్కపోతలోనే ప్రజాప్రతినిధుల ప్రసంగాలను కూటమి శ్రేణులు ఆసాంతం వినిక్రమశిక్షణను చాటారు. భారీ ప్రసంగాల జోలికి వెళ్లకుండా అభివృద్ధిపై లెక్కలతో వివరించిన మంత్రులు.. ప్రతి చోట రచ్చబండ, ఇతర చర్చల్లో అసలు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయా పార్టీల కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. నిరంతరాయంగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షే మం పరిఢవిల్లుతుందని.. గొడ్డలి పార్టీ మళ్లీ వస్తే రాష్ట్ర నాశనం అవుతుందని హితవు పలికారు.
‘రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా రెండేళ్లుగా అనేక కార్యక్రమాలను నెరవేర్చాం. రాబోయే రోజుల్లో రైతు అధిక ఆదాయం దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. వ్యవసాయం రంగంలో జీడీపీలో మనమే టాప్‌లో ఉన్నాం, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉన్న ఏలూరును మూడో స్థానంలో నిలిపేందుకు సమష్టిగా అందరూ కలిసి పనిచేద్దా’మని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో రెండేళ్ల కూటమి పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ (అన్నదాత– సుఖీభవ)కు ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల విచ్చేసి జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ ‘రైతులను గత వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసింది. చివరలో 4.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 6.30 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.434 కోట్ల బకాయిలను పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చాం. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోగా రైతుల ఖాతాలకు సొమ్మును జమ చేస్తున్నాం. వరికి మరింత ఆదాయం పెరగాలంటే ప్రిపర్డ్ రకాలను ప్రోత్సహించాలి. జిల్లా జీడీపీ వృద్ధి రేటులో వ్యవసాయం, అనుబంధ రంగాలు 8.8 శాతం రాష్ర్టానికి అందిస్తున్న ఘనత మనదే. జిల్లాలో 22ఏ కేసుల పరిష్కా రంలో రాష్ట్రంకు జిల్లా ఆదర్శంగా నిలిచింది. జిల్లాలో 240 కిలోమీటర్ల మేర కొత్తగా రోడ్లు నిర్మించా’మన్నారు.
ప్రాజెక్టులను జగన్ అథోగతి పాలు చేశారు
మంత్రి కొలుసు
అభివృద్ధి, సంక్షేమంలో వైసీపీకి మించి రెండేళ్లకాలంలో పలు పథకాలను అమలు చేశాం. దీనిపై దమ్ముంటే చర్చకు తాము సిద్ధం.. ఏలూరా? దెందులూరులో వేదిక ఎక్కడైనా వైసీపీ చర్చకు వస్తే దానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కొలుసు పార్థసారఽథి సవాల్ విసిరారు. 2017లో 2603 కోట్ల వ్యయంతో సీఎం చంద్రబాబు చింతలపూడి ప్రాజెక్టు పనులు చేపడితే గత ప్రభుత్వం ప్రాజెక్టును గాలికి వదిలేసిందని, పోలవరం ప్రాజెక్టును 70శాతం పూర్తి చేస్తే కనీసం 10 శాతం కూడా పూర్తి చేయని జగన్ ప్రభుత్వ విధ్వంసకర పాలన నుంచి అందరం విముక్తలయ్యామన్నారు. గృహ నిర్మాణాలు ఆగిన వాటిని ఈ నెలలో గాడిలో పెడతామన్నారు.వైసీపీ ఐదేళ్ల పాలన లో పంచాయతీల్లో ఏమీ జరిగింది, కూటమి కాలంలో ఏమీ చేసిందీ అంకెలతో సహా ప్రతీ పంచాయతీలో ప్రదర్శన గా ఉంచాలని కలెక్టర్ సూచించామన్నారు.
ఫ సభకు అధ్యక్షత వహించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రెండేళ్ల కూటమి ప్రభుత్వం ఎన్నో అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు సూపర్ సిక్స్ పథకాలను విజ యవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 2024 –25 సంవ త్సరంలో జిల్లాలో లక్షా 60,968 మంది రైతులకు రాష్ట్ర ప్రభు త్వం రూ.225 కోట్లు రైతుల ఖాతాలో వేసిందన్నారు. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం సీఎం కిసాన్ పథకం ద్వారా రూ.77.20 కోట్లు రైతులకు ఇచ్చిందన్నారు.
ఫ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ విధ్వంస పాలన నుంచి వికాసం వైపు కూటమి ప్రభుత్వం రాష్ర్టాన్ని తీసుకొచ్చిందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిందన్నా రు. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సంక్షేమం వైపు నడిపిస్తున్నారని అన్నారు.
ఫ ఎంపీ మహేశ్‌కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం 20ఏళ్లు అధికరంలో ఉంటే దేశంలోనే నెంబర్‌వన్‌గా ఎదుగుతుందన్నారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో రూ.250 కోట్లతో రోడ్లు నిర్మించామన్నా రు. పోలవరం నిర్వాసితులకు రూ.2వేలు కోట్లు చెల్లించామన్నారు. రాబోయే రెండేళ్లలో కొల్లేరు సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రగతి నివేదికను వివరిస్తూ అన్నక్యాంటీన్ల ద్వారా 1.27 లక్షల మంది ఆహారం అందించామని, అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో 1.90లక్షల మందికి 225 కోట్లు జమ చేశామన్నారు. పీ–4 కార్యక్రమం కింద జిల్లాలో 15 వేల బంగారు కుటుంబాలను గుర్తించి 4,800 మంది మార్గదర్శకులను అనుసంథానం చేశామన్నారు. జిల్లాలో పేదలకు 12,500 ఇళ్లను నిర్మించామని, గిరిజన గ్రామాల్లో సొలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వందన సమర్పణతో సభ ముగిసింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభా కర్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎస్పీ ప్రతాప కిశోర్, జేసీ అభిషేక్ గౌడ, మేయర్ షేక్ నూర్జహాన్, ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఆగ్రోస్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిశోర్, ఉమ్మడి పశ్చిమ జిల్లా జనసేన అఽధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, మాజీ ఎమ్మెల్యేలు అంబికా కృష్ణ, ఘంటా మురళీ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డీఆర్వో దేవకిదేవి, కూటమి పార్టీల నేతలు ఏఎంసీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రైతులతో స్టేడియం కళకళ : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు వివరించేందుకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అన్నదాత సుఖిభవ కార్యక్రమానికి రైతుల నుంచి భారీ స్పందన లభిం చింది. కూటమి ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతులంతా సభలో పాల్గొని విజయవంతం చేశారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు ఐదువేల మందికి పైగా హాజరైన రైతులతో స్టేడియం కళకళలాడింది. అధిక సంఖ్యలో మహిళా రైతులు హాజరు కావడం విశేషం.
ఆకట్టుకున్న స్టాల్స్ : అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ విశేషంగా ఆకట్టుకు న్నాయి. రెండేళ్ల కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఈ స్టాల్స్ ప్రదర్శనలో కొట్టొచ్చినట్టు కనిపించాయి. పంచా యతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ రెవెన్యూ, పంచాయ తీ రాజ్, మెప్మా, ఉద్యాన శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలు, విద్యుత్ శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశాయి.