బీచ్‌కు సందర్శకుల తాకిడి
ABN , Publish Date - May 17 , 2026 | 11:55 PM
కెపిపాలెం, పేరుపాలెం సాగర తీరాలు ఆది వారం సందర్శకులతో కిటకిటలాడాయి.
మొగల్తూరు, మే17(ఆంధ్రజ్యోతి): కెపిపాలెం, పేరుపాలెం సాగర తీరాలు ఆది వారం సందర్శకులతో కిటకిటలాడాయి. సెలవుదినం కావడం, పగటి ఉష్టోగ్రతలు తీవ్రరూపం దాల్చడంతో ఇంటిలో ఉండలేక ప్రకృతి గాలిలో గడిపేందుకు జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా సందర్శకులు తరలివచ్చి సముద్ర స్నానం చేసి సేద తీరారు. సముద్ర స్నానం అనంతరం తీరం వెంబడి గల కొబ్బరి, సరుగుడు తోటల్లో సందర్శకులు బంధుమిత్రులతో గడిపారు. తీరంలోని ఆలయా లను దర్శించుకున్నారు.