Share News

ఇనామ్‌కు విముక్తి!

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:02 AM

గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస ఇనామ్‌ భూములు కలిగిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జమీందార్ల కింద కుల వృత్తుల చేసుకుంటూ వారి నుంచి పొందిన ఇనామ్‌ భూములు (సర్వీస్‌ల్యాండ్‌)పై చాలాకాలం నుంచి కొనసాగుతున్న నిషే ధాజ్ఞలను ఎత్తివేస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇనామ్‌కు విముక్తి!

నిషేధం ఎత్తివేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు..

ప్రస్తుతం 201.87 ఎకరాలకు మోక్షం

త్వరలో మరో 700 ఎకరాలకు..

(ఏలూరు– ఆంధ్రజ్యోతి):

గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస ఇనామ్‌ భూములు కలిగిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జమీందార్ల కింద కుల వృత్తుల చేసుకుంటూ వారి నుంచి పొందిన ఇనామ్‌ భూములు (సర్వీస్‌ల్యాండ్‌)పై చాలాకాలం నుంచి కొనసాగుతున్న నిషే ధాజ్ఞలను ఎత్తివేస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ప్రస్తుతానికి 200.87 ఎకరాల భూములకు సోమవారం నుంచి ఆయా రైతులు రిజిస్ర్టేషన్లు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది.

చాలాకాలంగా ప్రీహోల్డ్‌లో ఉన్న ఇనామ్‌ భూములకు ప్రభుత్వం చొరవతో విముక్తి లభించింది. వీటికి క్రయ, విక్రయాలకు ప్రభు త్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో కలెక్టర్‌ వెట్రిసెల్వి నిషేధాజ్జలు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు. జిల్లాలో 1186.44 ఎకరాల ఇనామ్‌ భూము లున్నాయి. కొన్నిచోట్ల భూములకు సంబంధించి ఈ వారంలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకా శం ఉంది. లింగపాలెం, కొయ్యలగూడెం మండ లాల్లో మాత్రమే నిషేధాజ్జలు ఎత్తివేశారు.

కులవృత్తిదారులకు ఊరట

ప్రధానంగా జిల్లాలో జమీందారీ వ్యవస్థ ఉన్నప్పడు ఆయా పెద్దలను నమ్ముకుని వండ్రంగి, మంగళి, చాకలి, కుమ్మరి తదితర వృత్తులు చేసుకుని జీవనం సాగే కుటుంబా లుండేవి. వారికి కులవృత్తులపై పెద్దగా ఆదా యం లేకపోవడంతో జమీందార్లు వారి కింద సాగులో ఉన్న భూముల్లో అరెకరం, ఎకరం భూములను ఇనామ్‌గా కులవృత్తులపై ఆధార పడిన కుటుంబాలకు రాసిచ్చారు. ఇవి చాలా కాలం నుంచి అమ్ముకునే అవకాశం లేకుండా పోవడంతో.. అవి ప్రీహోల్డ్‌లో పెట్టారు. ఇప్ప టికి విముక్తి కలిగింది. ప్రధానంగా ఆగిరిపల్లి మండలంలోనే 700కు పైగా ఇనామ్‌ భూము లకు క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉన్నట్టు సమాచారం.

ఈ రెండు డివిజన్లలో కీలకంగా...

నూజివీడు రెవెన్యూ డివిజన్‌లోని లింగ పాలెం మండలం ముడిచర్లలో 14 మంది కి 12.38 ఎకరాలు, కొత్తపల్లిలో నలుగురికి 6.96, భోగోలులో 24 మందికి 29.94, ఆశన్న గూడెం లో ఏడుగురికి 5.47, టీసీహెచ్‌ఆర్‌ పాలెం ఒక రికి 1.11, రంగాపురంలో 11 మందికి 9.84, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని కొయ్యలగూడెం మండలంలోని మంగపతిదేవిపట్నంలో ఐదుగురికి 12.23, సరిపల్లిలో నలుగురికి 3.89, చొప్పరామన్న గూడెంలో 18 మందికి 11.68, ఈదువాడలపల్లిలో 18 మందికి 13.86, రాజవరంలో 101 మందికి 94.50 ఎకరాల మేర ఇనామ్‌ భూములున్నట్టు అధికారుల గణాంకాలు చెబుతు న్నాయి.

Updated Date - Apr 20 , 2026 | 12:02 AM