ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:31 AM
ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద పిల్లలకు జిల్లా విద్యా శాఖ ఉచిత సీట్లు కేటాయించింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జిల్లాలోని 273 ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు మంజూరు చేశారు.
గత ఫీజులను చెల్లిస్తున్న ప్రభుత్వం
ఒక్కో విద్యార్థికి రూ.11,500 జమ
ఈ సీట్లలో తల్లికి వందనం లేనట్టే
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద పిల్లలకు జిల్లా విద్యా శాఖ ఉచిత సీట్లు కేటాయించింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జిల్లాలోని 273 ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు మంజూరు చేశారు. ఈ ఏడాది 1047 మంది విద్యార్థులు ఉచిత సీట్లు పొందారు. వారందరికీ ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. గత ఏడాది విద్యా శాఖ కేటాయించిన సీట్లకు ఇప్పు డిప్పుడే ప్రభుత్వం ఫీజులు జమచేస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.11,500 వంతున చెల్లిస్తోంది. గతంలో రూ.18 వేలు ఇచ్చేవారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు అదే ఫీజు అమలయ్యేది. సాంఘిక సంక్షేమ శాఖ నుంచి నిధులు మం జూరయ్యేవి. వైసీపీ ప్రభుత్వంలో ఫీజులు జమ చేయలేదు. సీట్లను రద్దు చేసింది. అప్ప టికే ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు పొందిన వారికి ఫీజులు జమ చేయలేదు. దాంతో విద్యా ర్థులు మళ్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చేరాల్సి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వా త మళ్లీ ఉచిత సీట్ల విధానాన్ని అమలు చేస్తు న్నారు. గత ఏడాది నుంచే సీట్లు కేటాయిస్తు న్నారు. విద్యార్థి ఐదు కిలోమీటర్ల పరిధిలోవున్న పాఠశాలలనే ఎంపిక చేసుకోవాలి. అందులో ఒక దానిని విద్యాశాఖ కేటాయించనుంది. నర్సా పురంలోనే అత్యధికంగా పోటీ ఉంది. అక్కడ ఒకే ప్రైవేటు పాఠశాలలో 30 మందికి సీట్లు లభించాయి. బడ్జెట్ పాఠశా లల్లోనూ విద్యా శాఖ ఉచిత అడ్మిషన్లు కల్పిస్తోంది.
ఫీజులపైనే ఆవేదన
ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వం చెల్లించే ఫీజులపైనే ఆవేదన చెందుతున్నారు. గతంలో రూ.18 వేల వరకు జమ చేసేది. ఇప్పుడు తగ్గిం చింది. ఓ వైపు ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు తల్లికి వందనం అమలు కాదు. ప్రభుత్వమే వారి ఫీజును చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందరు పిల్లలున్నా సరే రూ. 13 వేల వంతున సొమ్ములను తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు పొందిన వారికి తల్లికి వందనం చేయడం లేదు. ప్రభుత్వమే వారి ఫీజును చెల్లిస్తోంది.
ప్రైవేటు యాజమాన్యాలకు మాత్రం పీజులు తక్కువగా ఉన్నాయనే ఆవేదన ఉంది. అడ్మి షన్లు ఇవ్వకపోతే విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకుంటున్నారు. అడ్మిషన్లు కల్పించేలా ప్రైవే టు విద్యా సంస్థలతో సంప్రదిస్తున్నారు. కేటా యించిన సీట్లల్లో వంద శాతం భర్తీ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా సాంఘిక సంక్షేమ నుంచి నిధులు మంజూరైతే కాస్త అధిక పీజులు వచ్చేవని అభిప్రాయ పడు తున్నాయి. తక్కువ ఫీజులను చెల్లిస్తుండడంతో ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ న్యాయస్థా నాన్ని ఆశ్రయించింది. వారికి అనుకూలంగా తీర్పు వచ్చినా కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర ప్రభు త్వం ఉచిత సీట్లు కేటాయిస్తోంది. ఒకటో తరగ తిలో చేరాలనుకునే విద్యార్థులకు అనుకున్న పాఠశాలలో సీటు పొందకపోతే చేరేందుకు విముఖత చూపుతున్నారు. వారికి తల్లికి వంద నం పడదంటూ అధికారులు స్పష్టం చేస్తున్నా రు. తల్లిదండ్రులు ఆలోచనలో పడిపోతున్నారు.