దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రారంభం
ABN , Publish Date - Mar 19 , 2026 | 01:08 AM
దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమంతో పాటు వారి ప్రయాణాల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. సత్యనారాయణపురంలో బుధవారం దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆమె ప్రారంభించి ఏలూరు వరకు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు
దెందులూరు,మార్చి 18 (దెందులూరు) : దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమంతో పాటు వారి ప్రయాణాల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. సత్యనారాయణపురంలో బుధవారం దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆమె ప్రారంభించి ఏలూరు వరకు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు.ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు
దివ్యాంగులతో సహపంక్తి భోజనం
ఏలూరు రూరల్ : జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వి దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజ ాన్ని చేశారు. భోజనం చేస్తూ దివ్యాంగులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు నోటు బుక్కులను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హులు అయిన దివ్యాంగులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తామని, జిల్లాలో దివ్యాంగులకు కేటాయించిన బ్యాగ్‌లాగ్ పోస్టుల ను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. సదరన్ క్యాంపులను క్రమం తప్పకుండా నిర్వహించి సదరం సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. డీఆర్వో విశ్వేశ్వరరావు, జిల్లా దివ్యాంగులు సంక్షేమశాఖ సహాయ సంచాలకులు రామ్‌కుమార్, ఏవో నాంచారయ్య, ఏలూరు అర్బన్ తహసీల్దార్ గాయత్రి జిల్లా దివ్యాంగులు సంక్షేమ సంఘం (ఏడీఎస్‌ఎస్) ప్రెసిడెంటు మామిడిపల్లి నాగభూషణం, జిల్లా దివ్యాంగుల ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ వీరభద్ర రావు పాల్గొన్నారు.