Share News

210 ఎకరాలకు మోక్షం

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:37 AM

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇష్టా రాజ్యంగా భూములను నిషేధిత జాబితాల్లో చేర్చడంతో పేదలు తమ పొలాలు, స్థలాలున్న అనుభవించలేని దుస్థితి. రెండేళ్లు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేయడంతో జిల్లాలో ఫ్రీహోల్డ్‌ భూములకు విముక్తి కలగనుంది.

210 ఎకరాలకు  మోక్షం

జిల్లాలోను ఫ్రీహోల్డ్డ్‌కు విముక్తి

207 మంది పేద రైతులకు ఊరట

రిజిస్ర్టేషన్లకు పచ్చజెండా

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇష్టా రాజ్యంగా భూములను నిషేధిత జాబితాల్లో చేర్చడంతో పేదలు తమ పొలాలు, స్థలాలున్న అనుభవించలేని దుస్థితి. రెండేళ్లు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేయడంతో జిల్లాలో ఫ్రీహోల్డ్‌ భూములకు విముక్తి కలగనుంది. జిల్లాలో నూజివీడు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో 207 మంది రైతులకు చెందిన 201 ఎకరాల భూములను స్వేచ్ఛగా అనుభవించడంతో పాటు అమ్ముకునే హక్కు ను పొందనున్నారు. వీటికి రిజి స్ర్టేషన్లు చేయించుకోవ డానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో క్రయ, విక్రయాలకు మార్గం సుగమ మైంది. జగన్‌ హయాంలో ఇష్టానుసారంగా ఈ రెండు డివిజన్లలో సర్వీసు, ఇనామ్‌, చుక్కల భూములపై నిషేఽధం విధించడంతో అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల్లోను వీటికి మోక్షం కల్పించాలని అర్జీలు దాఖలు చేశారు. రెండేళ్ల వీరి నిరీక్షణకు ప్రభుత్వం తెరదించింది. నూజివీడు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో లింగపాలెం మండలంలోని ముడిచర్లలో 14 మంది రైతులకు 12.38 ఎకరాలు, కొత్తపల్లిలో నలుగురికి చెందిన 6.96, భోగోలు లోని 24 మందికి చెందిన 29.94, ఆశన్నగూడెంలో ఏడు గురికి చెందిన 5.47, తోచిలక రాయుడు పాలెంలో ఒక రైతుకు 1.11, రంగాపురంలో 11 మందికి చెందిన 9.84, జంగా రెడ్డిగూడెం డివిజన్‌ పరిధిలోని మంగదేవి పట్నం లో ఐదుగురికి చెందిన 12.23, సరిపల్లిలో నలుగురికి చెంది న 3.89, చొప్పరగూడెంలో 18 మందికి చెందిన 11.69, ఈదువాడపల్లెలో 18 మందికి చెందిన 13.86, రాజవరం లో 101 మందికి చెందిన 94.50 ఎకరాలకు ప్రభుత్వ నిర్ణయంతో మోక్షం కలగనుంది.

Updated Date - Sep 17 , 2026 | 12:37 AM