స్త్రీ శక్తి జోష్ !
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:31 PM
మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని జిల్లాలో మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. బస్సు ప్రయాణాల్లో పురుషులు కంటే మహిళలే అధికంగా ఉంటున్నారు.
పథకం తర్వాత పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్య
ఇప్పటి వరకు 5.70 కోట్ల మందికి పైగా బస్సు ప్రయాణాలు
ప్రభుత్వ రాయితీ 106.57 కోట్లు
నివేదిక ఇచ్చిన ఆర్టీసీ అధికారులు
భీమవరంటౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని జిల్లాలో మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. బస్సు ప్రయాణాల్లో పురుషులు కంటే మహిళలే అధికంగా ఉంటున్నారు. గతంలో మహిళల ప్రయాణం తక్కువగా ఉండేది. స్త్రీ శక్తి పఽథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి పురుషుల సంఖ్య తగ్గిపోయింది. వందమంది ప్రయాణాలు చేస్తే అందులో మహిళలు 66 మంది ఉంటున్నారు. స్ర్తీ శక్తి పథకం నివేదికను ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ) మేనేజింగ్ డైకర్టర్‌కు అందిం చారు. జిల్లా అధికారులతో ఎండీ విజ యవాడలో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా వివరాలు సేకరించారు.
పెరుగుతున్న ఆదరణ
జిల్లాలో స్త్రీశక్తి పథకానికి ఆదరణ పెరుగుతోంది. గతేడాది కంటే ఈసారి మహిళల రాకపోకలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 15న పఽథకాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు 5 కోట్ల 70 లక్షల 018 మంది మహిళలు వినియోగించుకున్నారు. రూ.106.57 కోట్ల రాయితీని ప్రభుత్వం భరించింది. పండుగలు, శుభ కార్యాల సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్త్రీశక్తి పథకం రాక ముందు జిల్లాలో రోజుకు సరాసరిన 70,580 మంది ప్రయాణిస్తే పఽథకం వచ్చిన తరువాత 1,23,500 మంది ప్రయాణిం చారు. దీంతో జిల్లాలో దాదాపు 53 వేలు పెరిగినట్లు అధికారులు లెక్కలు తేల్చారు.