Share News

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్లకు 556 మంది ఎంపిక

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:27 AM

విద్యాహక్కు చట్టం–2009 రూల్‌ 12(1)సీ ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో నిర్దేశిత బడుగు, బలహీనవర్గాల కుటుంబా ల్లోని పిల్లలకు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లకు వచ్చే విద్యాసంవత్సరానికి (2026–27) ఉచిత అడ్మిషన్లు కల్పించేందుకు స్వీకరించిన దరఖాస్తుల నుంచి తొలివిడతగా జిల్లాలో 556 మంది బాల బాలికలను లాటరీ ద్వారా ఎంపిక చేసినట్టు సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ కె.పంకజ్‌కుమార్‌, సీఎంవో యోహోషువ ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్లకు 556 మంది ఎంపిక

ఏలూరు అర్బన్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు చట్టం–2009 రూల్‌ 12(1)సీ ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో నిర్దేశిత బడుగు, బలహీనవర్గాల కుటుంబా ల్లోని పిల్లలకు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లకు వచ్చే విద్యాసంవత్సరానికి (2026–27) ఉచిత అడ్మిషన్లు కల్పించేందుకు స్వీకరించిన దరఖాస్తుల నుంచి తొలివిడతగా జిల్లాలో 556 మంది బాల బాలికలను లాటరీ ద్వారా ఎంపిక చేసినట్టు సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ కె.పంకజ్‌కుమార్‌, సీఎంవో యోహోషువ ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌ఫోన్లకు సమాచారం పంపినట్టు వివరించారు. ఈ పథకం కింద జిల్లాలో 1,105 మంది దరఖాస్తు చేసుకోగా పాఠశాలల ఎంపికను 788 మందే చేసుకోవ డంతో వారికి లాటరీ ద్వారా ఆయా స్కూళ్ల కేటాయింపు జరిగింది. వీరంతా తమకు కేటా యించిన పాఠశాలల్లో ఏప్రిల్‌ 7వ తేదీలోగా రిపోర్టు చేయాలి. మిగిలిన సీట్లకు రెండో విడ త లాటరీ ద్వారా కేటాయింపులు ఏప్రిల్‌ 12న జరుగుతాయయి. తొలివిడత లాటరీ ద్వారా ఎంపికైన విద్యార్థులు పాఠశాలల్లో చేరేటప్పుడు దరఖాస్తు/సీటు కేటాయింపు పత్రం, పుట్టినతేదీ సర్టిఫికెట్‌, విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి పాస్‌ పోర్టుసైజు ఫొటోలు, మొబైల్‌ నంబరు సమర్పించాలి.

Updated Date - Mar 27 , 2026 | 12:27 AM