Share News

కల్యాణంపాడు జామాయిల్‌ అడవిలో మంటలు

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:08 AM

ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు చెం దిన జామాయిల్‌ అడవిలో సోమవారం మంటలు చెలరేగడంతో గ్రామ స్థులు భయాందోళనకు గురైన ఘటన లింగపాలెం మండలంలో చోటు చేసుకుంది.

కల్యాణంపాడు జామాయిల్‌ అడవిలో మంటలు
అడవిలో మంటలు

కల్యాణంపాడు జామాయిల్‌ అడవిలో మంటలు

లింగపాలెం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు చెం దిన జామాయిల్‌ అడవిలో సోమవారం మంటలు చెలరేగడంతో గ్రామ స్థులు భయాందోళనకు గురైన ఘటన లింగపాలెం మండలంలో చోటు చేసుకుంది. లింగపాలెం మండలంలోని కల్యాణంపాడు గ్రామానికి ఆనుకుని ఉన్న జామాయిల్‌ అడవిలో మంటలు చెలరేగడంతో ఊరి వైపునకు వస్తుండటంతో భయాందోళనలకు గురైన గ్రామస్థులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించడంతో పాటు మంటలను అదుపు చేశా రు. సమాచారం అందుకున్న నూజివీడు ఫైర్‌ ఆఫీసర్‌ జి.నాగరాజు సి బ్బందితో వచ్చి మండలను అదుపు చేశారు. చింతలపూడి మండలం లోని ఫైరింజన్‌ కొంత కాలంగా పనిచెయ్యక పోవడంతో 30 కిలోమీటర్ల దూరంలోని నూజివీడు కార్యాలయానికి సమాచారం అందించాల్సి వస్తుం దని, అప్పటికే భారీగా నష్టం వాటిల్లుతోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో ఫైర్‌ స్టేషన్‌ నిర్మించాలని నిబందనలున్నా అగ్నిమాపకశాఖ అధికారులు పట్టించుకోవడం లేదం టూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Feb 10 , 2026 | 12:08 AM