Share News

ఎర్ర నీటికి ఎదురుచూపు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:32 AM

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పచ్చదనం, ప్రకృతి అందాలకు ప్రధాన కారణం నిండు గోదావరి. ఏడాది పొడవునా.. గలగలపారే ఈ గోదావరి జలాలు జూన్‌, జూలై మాసాల్లో వచ్చే వరదకు నీరు ఎరుపు రంగులోకి మారుతుంది.

ఎర్ర నీటికి ఎదురుచూపు
గోదావరిలో కనిపించని ఎర్రనీరు

ఎల్‌నినో ప్రభావంతో కురవని వర్షాలు.. రోజుకు 60 వేల క్యూసెక్కులే కిందికి..

గత ఏడాది జూన్‌లోనే వరదలు.. లక్షల క్యూసెక్కుల వరద..

ఈసారి లేక జాడలేని మత్స్య సంపద.. మాంసాహారులకు నిరాశ

నరసాపురం, జూలై 29(ఆంధ్రజ్యోతి):ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పచ్చదనం, ప్రకృతి అందాలకు ప్రధాన కారణం నిండు గోదావరి. ఏడాది పొడవునా.. గలగలపారే ఈ గోదావరి జలాలు జూన్‌, జూలై మాసాల్లో వచ్చే వరదకు నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. నదికి అనుసంధానంగా ఉండే కాల్వలు, పిల్ల కాల్వలు డిసెంబరు వరకు ఇదే రంగుతో ఉంటాయి. ఈ కొత్త నీటికి మత్స్య సంపద ఎదురేగుతుంటుంది. సముద్రం నుంచి నదిలోకి, ఆక్కడ నుంచి పిల్ల కాల్వల్లోకి వలస వెళుతుంటాయి. ఈ కారణంగా డిసెంబరు వరకు ఈ ప్రాంతంలో పుష్కలంగా మత్స్య సంపద దొరుకుతుంటుంది. ప్రత్యేక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిని చూపి స్తుంటుంది. అయితే ఈ ఏడాది ఇంక గోదావరి లోకి ఎర్ర నీరు తాకలేదు. జూలై పూర్తయినా.. వరద లేకపోవడంతో ఇటు రైతులతోపాటు మత్స్యకారులు, మాంసాహారులు ఢీలా పడ్డారు.

ుఽ ఏదీ ఆ గోదావడి

గోదావరికి సాధారణంగా జూన్‌ వచ్చిందంటే.. వరద నీరు తాకుతుంది. జూలై, ఆగస్టు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడు తుంటారు. 2004 మినహా ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వరద తాకింది. గత ఏడాదికి ఈ రోజుకు ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఆగస్టు రెండో వారంలో మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేసి తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలో కి విడిచి పెట్టారు. నేడు ఆ పరిస్థితి కనిపిం చడం లేదు. దీంతో గోదావరి మార్చి, ఏప్రిల్‌లో మాదిరిగానే నీలి రంగులోనే దర్శనమిస్తుంది.

ుఽ వరదొస్తే.. పుష్కలంగా మత్స్య సంపద

జిల్లా మత్స్య సంపదకు పెట్టింది పేరు. కాల్వలు, డ్రెయిన్లు, గోదావరి నదిపై ఆధారపడి వేలాది మంది మత్స్యకారులు జీవనోపాధి పొం దుతున్నారు. వరద సమయంలో మత్స్య సంపద పుష్కలంగా లభిస్తుంది. చప్ప నీటి కోసం సము ద్రం నుంచి చేపలు ఎదురొస్తుంటుంది. పులస, పండు గొప్ప, మాగ, కొయింగ వంటి రకాలు పుష్కలంగా దొరుకుతాయి. మత్స్యకారులకు ఉపాధి నిండుగా ఉంటుంది. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. గోదావరి నుంచి సముద్రంలోకి వరద నీరు వెళుతున్న సమ యంలో కొన్ని రకాల చేపలు ఎదురొస్తుంటాయి. ఇవి గోదావరిలోకి అక్కడి నుంచి పిల్ల కాల్వల్లోకి వెళ్లుంటాయి. ఇటు సముద్రంలోకి వెళ్లే మత్స్య కారులకు ఆ సమయంలో పుష్కలంగా మత్స్య సంపద దొరుకుతుంది. ఇటు గోదావరిలో వేట కళ కనిపిస్తుంటుంది. ఇంకా ఎర్ర నీరు లేక నదిలో ఆ సీన్‌ ఛాయలే కనిపించడం లేదు.

Updated Date - Jul 30 , 2026 | 12:32 AM