Share News

ఫిట్‌లైన్‌కు బ్రేకులు !

ABN , Publish Date - Sep 27 , 2026 | 11:51 PM

ప్రస్తుతం నరసాపురం స్టేషన్‌లో రెండు ఫిట్‌లైన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి శిథిలావస్థకు చేరింది. ఈ కారణంగా నిర్వహణ పనులన్నీ ఒక్క ఫిట్‌లైన్‌ మీదే చేస్తున్నారు.

ఫిట్‌లైన్‌కు బ్రేకులు !
నరసాపురం స్టేషన్‌లో పనిచేస్తున్న సింగిల్‌ ఫిట్‌లైన్‌

జోన్‌ మారడంతో పనులు పెండింగ్‌

దక్షిణ మధ్య రైల్వే ఉండగా

రూ.10 కోట్లు మంజూరు

ప్రస్తుతం సింగిల్‌ ఫిట్‌లైన్‌ పైనే

నిర్వహణ పనులు

నరసాపురం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నరసాపురం రైల్వేస్టేషన్‌లో ఫిట్‌లైన్‌ నిర్మా ణానికి జోన్‌ మార్పుతో రెడ్‌ సిగ్నిల్‌ వేసింది. గతంలో స్టేషన్‌ దక్షిణ మధ్య రైల్వేలో ఉండేది. అయితే ప్రస్తుతం విశాఖ జోన్‌గా సౌత్‌ కోచ్‌ రైల్వేగా మారింది. ఈ కారణంగా నిర్మాణానికి మంజూరు చేసిన రూ.10 కోట్లు పనులకు మళ్లీ కొత్త జోన్‌ నుంచి ఆమోదం తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సింగిల్‌ ఫిట్‌లైన్‌ మీదే పనులు చేయాల్సి వస్తున్నది.

ఫిట్‌లైన్‌ అంటే

రైల్వే నిర్వహణ పనులన్నీ ఫిట్‌లైన్‌ మీదే నిర్వహిస్తారు. ఒక్క రైలు గమ్య స్థానానికి వెళ్లి తిరిగి స్టేషన్‌కు రాగానే దాన్ని ఫిట్‌లైన్‌ మీదకు పంపుతారు. అన్ని డిపార్టుమెంట్లు సుమారు ఆరుగంటల పాటు రైలు నిర్వహణ పనులు చేపడతారు. అంతా ఓకే అయిన తరువాత ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి ఫ్లాట్‌ఫాం మీదకు తీసుకొస్తారు. ప్రస్తుతం నరసాపురం స్టేషన్‌లో రెండు ఫిట్‌లైన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి శిథిలావస్థకు చేరింది. ఈ కారణంగా నిర్వహణ పనులన్నీ ఒక్క ఫిట్‌లైన్‌ మీదే చేస్తున్నారు. స్టేషన్‌ నుంచి రోజు లింగంపల్లి, నాగర్‌సోల్‌, ధర్మవరం, హుబ్లీ, గుంటూరు వంటి ప్రధాన ఎక్స్‌ప్రెస్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కాకుండా బెంగళూరు, అరుణాచలం వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ అంతా సింగిల్‌ ఫిట్‌లైన్‌లో చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కొత్త రైళ్లకు ఫిట్‌లైన్‌ బ్రేక్‌

నరసాపురం స్టేషన్‌ నుంచి కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిలో వారణాసి రైలుతో పాటు ప్రస్తుతం వీక్లి నడుస్తోన్న బెంగళూరు, అరుణాచలం రైళ్ల ను వారంలో రెండుసార్లు నడిపే ఆలోచన పరి శీలనలో ఉంది. అయితే వీటి నిర్వహణ సింగిల్‌ ఫిట్‌లైన్‌ మీద చేయడం కష్టసాధ్యం. పనులు పూర్తయితే గాని ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం లేదని రైల్వే అఽధికారులు చెప్పుతున్నారు

పనులకు ఆనుమతి ఏప్పుడో..?

గతంలో నరసాపురం స్టేషన్‌ను సౌత్‌ సెం ట్రల్‌ రైల్వే జీఎం సందర్శించినప్పుడు అధికా రులు ఫిట్‌లైన్‌ ఆవశ్యకతను తెలియజేశారు. వెంటనే స్పందించిన జీఎం రూ.10 కోట్లు కేటా యించారు. దీనికి ఆమోదం కూడా లభించింది. అయితే మూడు నెలల నుంచి జిల్లా స్టేషన్లన్నీ కొత్త జోన్‌లోకి వెళ్లాయి. అందులో నరసాపురం స్టేషన్‌ కూడా ఉంది. గతంలో ఆమోదం పొం దిన పనులన్నీ సౌత్‌ కోస్ట్‌ రైల్వే పరిపాలన పొందిగే గాని టెండర్లు పలిచే అవకాశం లేదు. ఇప్పటికే అధికారులు పనులకు సంబంధించిన ప్రతి పాదనలు జోన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు రెడీగా ఉన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 11:51 PM