Share News

వేటకు విరామం

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:43 AM

చేపల వేట ద్వారా జీవనం సాగించే మత్స్యకారుల ఉపాధికి బ్రేక్‌ పడింది.

   వేటకు విరామం
ఎర్రకాలువ జలాశయంలో చేపల వేట నిషేధమంటూ ఫ్లెక్సీని చూపుతున్న మత్స్యశాఖాధికారులు

తొలిసారిగా రెండు నెలలు ఎర్రకాలువ జలాశయంలో చేపల వేట నిషేధం

ఉపాధి కోల్పోతామంటూ మత్స్యకారుల ఆవేదన

జంగారెడ్డిగూడెం రూరల్‌, జూలై 7(ఆంధ్ర జ్యోతి):చేపల వేట ద్వారా జీవనం సాగించే మత్స్యకారుల ఉపాధికి బ్రేక్‌ పడింది. ఎర్రకాలువ జలాశయంలో తొలిసారిగా రెండు నెలల పాటు చేపల వేట నిషేధిస్తూ మత్స్యశాఖాధికారులు ఆదే శాలు జారీ చేయడంతో వారు ఆందోళన చెందు తున్నారు. చేపల వేటే ఆధారమని, మా కుటుం బాలను ఎలా పోషించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి (ఎర్ర కాలువ) జలాశయంలో జూలై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేట నిషేధం అమల్లో ఉందని మత్స్యశాఖ సహాయ సంచాల కులు రాజ్‌ కుమార్‌, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి జ్యోత్స్న తెలిపారు. జలాశయం వద్ద మంగళవారం మత్స్య కారులతో సమావేశం నిర్వహించారు. చేపల పునరుత్పత్తి కాలం కావడంతో ఈ రెండు నెలల్లో చేపలు గుడ్లు పెడతాయని, ఈ సమయంలో వేటను నిలిపివేస్తే చేపల సంపద పెరిగి భవిష్య త్తులో మత్స్యకారులకు మరింత ఆదాయం లభి స్తుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు, జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ఈ రెండు నెలల కాలంలో ప్రభుత్వం ఉపాధి కల్పిం చడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ మత్స్యకారులు వినతి పత్రం అందజేశా రు.జలాశయం పరిధిలోని ఏడు రేవుల మత్స్యకా రులు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 12:43 AM