Share News

చేపల ధర పతనం

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:18 AM

చేపల ధర పత నమైంది. నిన్న మొన్నటి వరకు తెల్లచేప కిలో రూ.122 ఉండగా ఒక్కసారిగా రూ.114కి పడిపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.

చేపల ధర పతనం
తెల్ల చేపలు

ఇతర ప్రాంతాలకు తగ్గిన ఎగుమతులు

నష్టాల ఊబిలో ఆక్వా రైతులు

కలిదిండి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి):చేపల ధర పత నమైంది. నిన్న మొన్నటి వరకు తెల్లచేప కిలో రూ.122 ఉండగా ఒక్కసారిగా రూ.114కి పడిపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. నిత్యం రూ.500 నుంచి 650 లారీల చేపలు ఇతర రాష్ర్టాలకు ఎగుమతులయ్యేవి. ప్రస్తుతం తెల్లచేప ధర పతనం కావడంతో 250 – 350 లారీలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. అస్సోం, పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టాల్లో చేపల కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు చేప ల మేత డీవోబీ తవుడు 10 టన్నులు రూ.లక్షా 50వేలు ఉండగా ప్రస్తుతం రూ.లక్షా 80 వేలు పలుకుతోంది. లీజు ఎకరానికి రూ.లక్షకు పైగా ఉంది. ఖర్చు పెరిగి చేపల ధర పడిపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. రెండు నెలలుగా పొగమంచు కారణంగా వాతా వరణం చల్లగా ఉండడంతో మేతలు సక్రమంగా తినకపోవడం తో చేపల ఎదుగుదల లోపించింది. దీనికితోడు పెట్టు బడి వ్యయం పెరగడం, చేపల ధర తగ్గుముఖం పట డంతో నష్టాల బారిన పడుతున్నామని వాపోతున్నారు.

గిట్టుబాటు ధర కల్పించాలి

తెల్లచేప ధర కిలో కనీసం రూ.125 ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెల్లచేపల ఎగుమతులు సక్రమంగా జరగాలి. ఈశాన్య రాష్ర్టాల్లో గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పెరిగిన చేపల మేతల ధరలను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– మంతెన సుబ్బరాజు, ఆక్వా రైతు, భాస్కరరావుపేట

Updated Date - Feb 09 , 2026 | 12:18 AM