Share News

చేపల జాతర!

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:54 PM

తుఫాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డ్రైన్లు పొంగి రహదారులు, పొలాలతోపాటు చేపల చెరువులు ముంపునకు గురయ్యాయి. చెరువుల గట్లు మునిగిపోవడంతో వాటిలోని భారీ చేపలు కాలువల్లోకి కొట్టుకొచ్చాయి. యనమదుర్రు డ్రైన్‌, వయ్యేరు కాలువల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపల పండగ వాతావరణం నెలకొంది.

చేపల జాతర!
దువ్వ హైవే వద్ద చేలల్లోకి కొట్టుకొచ్చిన చేపలను పట్టుకుంటున్న స్థానికులు

యనమదుర్రు డ్రైన్‌, వయ్యేరుల్లో పెద్దఎత్తున మత్స్య సంపద

చెరువుల గట్లు తెగడంతో వరద నీటిలో కొట్టుకొచ్చిన చేపలు

పది కిలోల బరువున్న వాలుగ, పండుగప్ప, శీలావతి లభ్యం

చూసేందుకు జనం ఎగబడటంతో స్తంభించిన ట్రాఫిక్‌

పాలకోడేరు/గణపవరం/తణుకు రూరల్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): తుఫాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డ్రైన్లు పొంగి రహదారులు, పొలాలతోపాటు చేపల చెరువులు ముంపునకు గురయ్యాయి. చెరువుల గట్లు మునిగిపోవడంతో వాటిలోని భారీ చేపలు కాలువల్లోకి కొట్టుకొచ్చాయి. యనమదుర్రు డ్రైన్‌, వయ్యేరు కాలువల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపల పండగ వాతావరణం నెలకొంది. కాలువల్లో తేలి యాడుతున్న చేపలను పట్టుకునేందుకు, కొనుగోలు చేసేందుకు జనం ఎగబ డటంతో భీమవరం, పాలకోడేరు తదితర ప్రాంతాల్లో వంతెనలపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

పాలకోడేరు మండలం యనమదుర్రు డ్రైన్‌పై గల పాలకోడేరు, గొల్లల కోడేరు వంతెనల వద్ద స్థానికులు వలలతో చేపల వేట సాగించారు. ఇక్కడ రెండు నుంచి పది కిలోల బరువున్న భారీ చేపలు లభించడంతో కొనుగోలు దారులు ఎగబడ్డారు. మరోవైపు, వరద ముంపునకు గురైన పంట పొలాల్లోని మురుగునీరు యనమదుర్రు డ్రైన్‌లోకి చేరడంతో నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి చేపలుపైకి తేలుతున్నాయి. విషయం తెలుసుకున్న గణపవరం మండలంలోని కేశవరం, ఎస్‌.కొందేపాడు, పిప్పర, కోమర్రు గ్రామాల ప్రజలు చేపల కోసం ఎగబడ్డారు. మత్స్యకారులు వలలతో ముమ్మరంగా వేట సాగించారు. ఇక్కడ వాలుగా, పండుగప్ప, శీలావతి, బొచ్చెలు వంటి రకాలు దొరుకుతుండగా.. ఒక్కొక్కటి మూడు నుంచి ఐదు కిలోల బరువు ఉంటున్నాయి.

చేపలు పట్టుకోవడం, కొనుగోలు చేయడంతోపా టు ఆ దృశ్యాలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూప డంతో రోడ్లపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సాయంత్రం పాఠశాలలు, కార్యాలయాలు వదిలిన వేళ భీమవరం మినీ బైపాస్‌ వంతెనపై వాహనదారులు తమ వాహనాలను నిలిపివేసి కాలువలో చేపల వేటను వింతగా చూడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ప్రజలు వంతెనపైనే నిలబడిపోవడంతో మిగిలిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను పంపించి పరిస్థితిని చక్కదిద్దారు. అటు పాల కోడేరు వద్ద కూడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీ సులు వచ్చి క్రమబద్ధీకరించాల్సి వచ్చింది.

దువ్వ పొలాల్లో వేట

తణుకు రూరల్‌ మండలం దువ్వ వద్ద వయ్యేరు కాలువ వరద నీటిలో కొట్టుకొచ్చిన చేపల కోసం స్థానికులు ముమ్మ రంగా వేట సాగిస్తు న్నారు. తణుకు జాతీయ రహదారికి ఇరు వైపులా ఉన్న పంట పొలాలు, బోదెల్లో వలలు, గాలాలు వేసి వేటాడుతున్నారు. ఈ వేటలో పెద్ద పెద్ద చేపలు పడుతుండటంతో.. జాతీయ రహదారిపై ప్రయాణించే వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:54 PM