Share News

ముందు అమ్మేద్దాం

ABN , Publish Date - Jul 01 , 2026 | 01:03 AM

మనవాళ్లకు ఎన్ని ఆస్తులున్నా బంగారమంటేనే మక్కువ. బంగారం లేని ఇల్లు ఉండదు. సంపన్నులు అవసరానికి మించి కొనుగోలు చేసి దాచుకుంటారు.

ముందు అమ్మేద్దాం

పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తగ్గిన కొనుగోళ్లు

భీమవరం క్రైం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): మనవాళ్లకు ఎన్ని ఆస్తులున్నా బంగారమంటేనే మక్కువ. బంగారం లేని ఇల్లు ఉండదు. సంపన్నులు అవసరానికి మించి కొనుగోలు చేసి దాచుకుంటారు. ఇటీవల ఉమ్మడి పశ్చిమలో చాలామంది స్టాక్‌ మార్కెట్లు, రియల్‌ ఎస్టేట్‌ వదిలి బంగారంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. దీనికి కారణం రెండేళ్లుగా బంగారం ధరలు చుక్కలనంటాయి. లాభాలు బాగా వస్తున్నాయనే ఉద్దేశంతో కొనుగోళ్లు చేశారు. ఇటీవల బంగారం మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. విదేశాల నుంచి దిగుమ తులు తగ్గించేందుకు కేంద్రం పలు రకాల ఆం క్షలు విధించింది. ఈ క్రమంలో బంగారం ధర పతనం అవుతుందనే ప్రచారం జరుగుతుండటంతో అమ్మకానికి తెగబడుతున్నారు. లాకర్లలో దాచిన బంగారం బయటకు తీస్తున్నారు.

400 కేజీల వరకు అమ్మకం

ఉమ్మడి జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసాపురం, భీమవరం, పాలకొ ల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలలో సుమారు 600కు పైగా బంగారు దుకాణాలు ఉన్నాయి. రెండు నెలల్లో 400 కేజీలకు పైగా బంగారాన్ని వినియోగదారులు అమ్మేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. భారీగా కొనుగోళ్లు తగ్గాయని, అమ్మకానికి వస్తున్నారని చెబుతున్నారు. మూడు నెలలుగా ముహూర్తాలు లేకపోవడం, ప్రధాని మోదీ ఏడాదిపాటు బంగారాన్ని కొనవద్దని చెప్పడంతో అమ్మకాలు భారీగా తగ్గాయి. వివాహాలు, శుభకార్యాలు ఉన్నప్పుడు మాత్రమే బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. రెండేళ్ల క్రితం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు లక్ష రూపాయలు ఉండేది. ప్రస్తుతం లక్షా యాభై వేల వరకు ఉంది. ఈ రెండేళ్లలో 50 శాతం ధర పెరిగింది. వెండి ధర ప్రస్తుతం కొంత మేర తగ్గి కేజీ రూ.2.30 లక్షల వద్ద నిలకడగా ఉంది.

బంగారం ధర తగ్గుతుందనే ఆందోళనతో చాలామంది కొనుగోళ్లకంటే అమ్మేందుకు ఎక్కు వ వస్తున్నట్టు భీమవరం ధర్మకాటా అసోసియే షన్‌ ట్రెజరర్‌ బంగారు రజనీకాంత్‌ చెబుతు న్నారు. గతంలో కేజీ అమ్మే షాపులో నేడు పావు కేజీ కూడా అమ్మడం లేదన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 01:03 AM