Share News

మోటార్‌ సైకిల్‌ దగ్ధం

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:00 AM

ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీ కొట్టడంతో వాహ నం అగ్నికి ఆహుతైంది.

మోటార్‌ సైకిల్‌ దగ్ధం

దెందులూరు,నవంబరు 12 (ఆంధ్ర జ్యోతి) : ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీ కొట్టడంతో వాహ నం అగ్నికి ఆహుతైంది. మండలంలోని సోమవరప్పాడు 16వ నంబర్‌ జాతీయ రహదారి సమీపంలోని బ్రిడ్జి కింద గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వైపు వస్తున్న మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టి వెళ్లి పోయింది. దీంతో మోటార్‌ సైక్లిస్టు దూరంగా పడటంతో బైక్‌లో పెట్రోల్‌ లీకై మంటలు వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపే మోటార్‌ సైకిల్‌ పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - Nov 13 , 2026 | 12:01 AM