Share News

మంచం పట్టిన మన్యం!

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:44 AM

వాతా వర ణంలో మార్పుల కారణంగా సీజనల్‌ జ్వరాలు, వ్యాధులు విజృంభించడంతో మన్యంలోని ప్రజలు మంచం పడుతు న్నారు. ఏజెన్సీలో ఏ గ్రామంలో చూసిన ప్రతి ఇంటిలో ఒకరిద్దరు జ్వరాలు, సీజనల్‌ వ్యాధులు, టైఫాయిడ్‌, మలేరియాతో మంచాలపై మూలుగుతున్నారు.

మంచం పట్టిన మన్యం!
ఒకే బెడ్‌పై ఇద్దరికి వైద్యసేవలు

రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు

మన్యం ప్రజలను వెంటాడుతున్న సీజనల్‌, టైఫాయిడ్‌, మలేరియా జ్వరాలు

ఆసుపత్రుల్లో బెడ్‌ల కొరత..

సొంత మంచాలు తెచ్చుకుని చికిత్స పొందుతున్న రోగులు

నేలపై, ఆసుపత్రి బయట రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు

ఏజెన్సీలోని అన్ని ఆసుపత్రుల పరిధిలోను ఇదే పరిస్థితి

బుట్టాయగూడెం,జూలై 26(ఆంధ్రజ్యోతి): వాతా వర ణంలో మార్పుల కారణంగా సీజనల్‌ జ్వరాలు, వ్యాధులు విజృంభించడంతో మన్యంలోని ప్రజలు మంచం పడుతు న్నారు. ఏజెన్సీలో ఏ గ్రామంలో చూసిన ప్రతి ఇంటిలో ఒకరిద్దరు జ్వరాలు, సీజనల్‌ వ్యాధులు, టైఫాయిడ్‌, మలేరియాతో మంచాలపై మూలుగుతున్నారు. సీజనల్‌ జ్వరాలు, వ్యాధులతో వస్తున్న రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరు పడకలే ఉంటాయి. దీంతో బెడ్లు ఖాళీలేక ఇళ్ల నుంచే మంచాలు తెచ్చుకుని వైద్యం పొందాల్సిన దుస్థితి నెల కొంది. మండలంలో అంతర్వేదిగూడెం, దొరమామిడి, నందాపురం, కేఆర్‌పురం, పులిరాముడుగూడెంల్లో ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు, బుట్టాయగూడెంలో సామాజిక ఆరోగ్య కేంద్రం ఉంది. అంతర్వేదిగూడెం పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో విషజ్వరాలు విజృంభించడంతో ప్రస్తుతం ఆసుపత్రి నిండా రోగులే ఉన్నారు. ఆసు పత్రుల్లో బెడ్లు లేక ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురికి వైద్యం చేస్తున్నారు. కొందరిని నేలపైనే ఉంచి వైద్యం అందిస్తున్నారు.

అంతర్వేదిగూడెం వైద్యాధికారి డాక్టరు సురేష్‌కుమార్‌ జ్వరాలపై స్పందిస్తూ ఎంతమంది ఆసుపత్రికి వచ్చినా వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వాతా వరణం మార్పులతో సీజనల్‌ జ్వరాలు, వ్యాధులు వస్తు న్నాయని అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపం కారంగా దోమలు పెరిగి జ్వరాలు వెంటాడుతున్నాయని తెలిపారు.

ఒకపక్క జ్వరాలు వెంటాడుతుండగా మరోపక్క మలేరియా విజృంభణతో మరణాలు సంభవిస్తు న్నాయి. పీఆర్‌ గూడెంకు చెందిన మడకం నందిత (13) మలేరియా బారినపడి మరణించింది. కామయ్య కుంట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఆమెకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు ముందుగా పీహెచ్‌సీలో చూపించి మెరుగైన వైద్యం కోసం కొయ్యలగూడెం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. గతంలోను మోతుగూడెంకు చెందిన రికిత్వ చికిత్స పొందుతూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోగా మెరకగూడెంకు చెందిన తామా వెంకటలక్ష్మీ సిబ్బంది నిర్లక్ష్యంతో సకాలంలో వైద్యం అందక చనిపోయినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏజెన్సీలో మరణాలు నమోదవు తున్నా అధికారుల్లో స్పందన లేదని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి మెరుగైన వైద్యం అందించా లని, ఆసుపత్రుల్లో బెడ్లు పెంచాలని, వైద్యులను, సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచాలని, అన్ని రకాల వైద్యపరీక్షలు పీహెచ్‌సీల్లోనే చేయాలని మెరుగైన వైద్యం మందులు ఇవ్వాలని మన్యం వాసులు కోరుతున్నారు.

Updated Date - Jul 27 , 2026 | 12:44 AM