Share News

ఏరువాక సాగారో..

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:53 AM

ఏరువాక పౌర్ణమి అనేది రైతుల పండుగగా ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన వ్యవసాయ పండుగగా భావించి ఈ పండుగను ప్రతి గ్రామంలోను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఏరువాక సాగారో..

జిల్లాలో వ్యవసాయశాఖ ఏర్పాట్లు

లోపూడిలో మంత్రి కొలుసు, చొదిమెళ్ళలో కలెక్టర్‌ హాజరు

రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి : జేడీ

(ఏలూరుసిటీ– ఆంరఽధజ్యోతి)

ఏరువాక పౌర్ణమి అనేది రైతుల పండుగగా ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన వ్యవసాయ పండుగగా భావించి ఈ పండుగను ప్రతి గ్రామంలోను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు సంవత్సరంలో వచ్చే మూడో నెలను జ్యేష్ఠమాసం అంటారు. పౌర్ణమి తిథి నాడు చంద్రుడు జ్యేషా ్ఠనక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసం ఏర్పడు తుంది. ఇది అత్యంత శక్తివంతమైన మాసం. దైవారాధనకు, దాన ధర్మాలకు అత్యంత పవిత్ర మైనదిగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహా జేష్టి, ఏరువాక పౌర్ణమి పేర్లతో పిలుస్తారు. ఈ సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి జూన్‌ 29వ తేదీ సోమవారం వచ్చింది. రైతులు నాగలి పట్టి పొలం పనులు ప్రారంభించే రోజు కావడంతో ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తారు. రైతులు కొత్త వ్యవసాయ సంవత్సరానికి నాంది పలుకుతారు. భూమిని తల్లిగా భావించి పూజలు చేస్తారు. ఎద్దులు, నాగలి, వ్యవసాయ పనిముట్లకు పూజలు చేస్తారు. మంచి వర్షాలు కురిసి, పంటలు సంవృద్ధిగా పండాలని దేవుడిని ప్రార్థిస్తారు. పొంగలి, పులగం వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో జానపదగీతాలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జిల్లాలో ఏరువాక పౌర్ణమికి ఏర్పాట్లు

రైతుల పండుగగా ప్రసిద్ది చెందిన ఏరువాక పౌర్ణమి వేడుకలను జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించడానికి జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, రైతు లు, వ్యవసాయ శాఖాఽధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొంటారు. సంప్రదాయ పద్ధ్దతిలో నాగలి పూజ, భూమాత పూజలు నిర్వహించి పొలం లో దుక్కి దున్నడం ద్వారా ఖరీఫ్‌–2026 వ్యవసాయ సీజన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ఏలూరు మండలంలోని చొదిమెళ్ళలో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో, ప్రత్యేక కార్య క్రమంగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ముసునూరు మండలం లోపూడిలో జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ షేక్‌ హబీబ్‌బాషా తెలిపారు. ‘జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే కార్యక్రమంలో రైతులు అధికసంఖ్యలో పాల్గొనాలి. ఏరువాక పౌర్ణమి విశిష్టతను తెలుసుకుని రైతులు ఖరీఫ్‌ సాగుకు ఉపక్రమించా’లని జేడీ కోరా రు. ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువు లు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్స్‌ జిల్లాలో తగి నంతగా అందుబాటులో ఉన్నాయి. రైతులు ప్రభుత్వ అనుమతి పొందిన ఎరువులు, విత్తనాలు విక్రయ కేంద్రాల నుంచే కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్ల్లులు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.

Updated Date - Jun 29 , 2026 | 12:53 AM