ఎరువు..బరువు
ABN , Publish Date - May 19 , 2026 | 12:37 AM
ఎరువుల ధరలు పెరిగాయి. అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపైనా పడింది. కంపెనీలు కొత్త ధరలను ప్రకటించాయి. గతంలోనే పెంచిన ఎమ్మార్పీలతో ఎరువులను జిల్లాకు సరఫరా చేశాయి
డీఏపీ, యూరియా యథాతథం
వీటిపై కేంద్రం రాయితీ
ఇక భూమి ఉన్న రైతుకే ఎరువు
ఆధార్‌తో ఈకేవైసీ అవ్వాల్సిందే
మూడు దశల్లో కేటాయింపు
నిల్వ చేసుకోవాలంటే కదరదు
ఖరీఫ్‌కు సరిపడా
యూరియా, డీఏపీ నిల్వలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఎరువుల ధరలు పెరిగాయి. అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపైనా పడింది. కంపెనీలు కొత్త ధరలను ప్రకటించాయి. గతంలోనే పెంచిన ఎమ్మార్పీలతో ఎరువులను జిల్లాకు సరఫరా చేశాయి. కేంద్ర ప్రభుత్వం రాయితీ భరిస్తే పాత ధరలకే విక్ర యిస్తారని వ్యాపార వర్గాలు ఆశించాయి. అయితే డీఏపీ, యూరియాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాయితీ భరిస్తోంది. ముడిసరకుల ధరలు పెరిగినా సరే ఆ మేరకు కంపెనీలకు సొమ్ములు కేటాయిస్తోంది. ఇతర కాంప్లెక్స్ ఎరువులకు కూడా కేంద్రం పోషక మిశ్రమాల ఆధారంగా రాయితీని అమలు చేస్తోంది. అంతకు మించితే కంపెనీలు భరించాల్సి ఉంటోంది. అందుకే కాంప్లెక్స్, పొటాష్ ఎరువులు ధరలు విడతల వారీగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్రం ఇచ్చే రాయితీని పూర్తిగా నిలుపుదల చేస్తే ధరలు మరింత పెరిగి పోయేవి. యుద్ధ ప్రభావంతో ముడిసరుకు ధరలు పెరగడం వల్ల ఈసారి కంపెనీలు కాంప్లెక్స్, పొటాష్ ధరలను పెంచాయి.
ఆర్గానిక్ ఎరువులతో ముడి
కంపెనీలు మార్కెట్‌కు ఎరువులను సరఫరా చేసి నప్పుడు నానో ఎరువులతో జత పెడుతున్నాయి. ముఖ్యంగా డీఏపీ, యూరియా విషయంలో లింకు చేస్తున్నాయి. నానో డీఏపీ, జింక్‌లను ధ్రవరూపంలో అమ్మకాలు చేపడుతున్నాయి. అవి డీలర్‌లకు అప్పగి స్తున్నాయి. ఒకవైపు ధరలు పెంపు, మరోవైపు నానో ఎరువులు లింకుతో జిల్లా వ్యాపారులు సతమత మవు తున్నారు. సహకార సంఘాలకు డీఏపీ, యూరియా సరఫరా చేస్తున్నాసరే లింకు ఎరువులు ఇవ్వడం లేదు. పైగా రవాణా ఇతర ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం భరి స్తోంది. దాంతో ఇప్పుడు డీఏపీ, యూరియాను ఇకపై సొసైటీల ద్వారా విక్రయించుకోవాలంటూ వ్యాపార వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నాయి. అయితే గ్రామాల్లో రిటైల్ డీలర్ల వద్ద ఎరువులు తక్కు వుగా ఉంటే రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ఎరువుల కోసం ఎగబడుతున్నారు. ముందుగానే నిల్వ చేసు కుంటున్నారు. ఇది కొరతకు కారణమవుతోంది. గడచిన ఖరీఫ్, రబీ సాగులో ఒకింత అలజడి ఏర్పడింది. అధికారులు పర్యవేక్షణతో ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా కేటాయింపులు నిర్వహించారు. రైతుల్లో ఆందోళన దృష్టిలో ఉంచుకుని యూరియా, డీఏపీలను తప్పనిసరిగా వర్తకులు విక్రయించాల్సిందేనని ప్రభు త్వం స్పష్టం చేస్తోంది. కంపెనీల నుంచి లింకు ఎరువుల ముడితో వ్యాపార వర్గాలు గుబులు చెందు తున్నాయి. రైతులు వీటిని అంతగా ఉపయోగించడం లేదు. మార్కెట్‌లో అండర్ సేల్‌లో విక్రయిస్తున్నారు. నానో డీఏపీ ఎరువుల ధర రూ.500 ఉంటే మార్కెట్‌లో రూ.200లకు అమ్మకాలు సాగిస్తున్నారు. రైతులు దీనిపై అవగాహన పెంచుకోవడం లేదు. దీనివల్ల నాణ్యమైన దిగుబడులతోపాటు, చీడపీడల బెడద అంతగా ఉండదు. తక్కువ పెట్టుబడితో సాగు పూర్తవుతుంది.కానీ రైతులు సాధారణ ఎరువులకే ఆసక్తి చూపుతున్నారు.
డీఏపీ వినియోగం పెరగనుందా ?
కాంప్లెక్స్, పొటాష్ వంటి ఎరువుల ధరలను కంపె నీలు పెంచాయి. మున్ముందు మరి కాస్త పెంచే అవ కాశం ఉందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌కు సరిపడా డీఏపీ అందుబాటులో ఉంది. ఖరీఫ్‌లో 7500 టన్నుల డీఏపీ అవసరం కానుందని ప్రభుత్వం అంచనాతో ఉంది. గతంలో జిల్లా వ్యాప్తంగా వినియోగ మైన ఎరువులను లెక్కించుకుని ఇప్పుడు కోటాను అమలు చేస్తోంది. అయితే గత అంచనా కంటే అధి కంగా నిల్వ ఉన్నాయి. మిగులు డీఏపీని తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు తరలించాలంటూ వ్యాపా రస్తులకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే కాంప్లెక్స్ ధరలు పెరగడంతో జిల్లాలో రైతులు డీఏపీని అధికంగా ఉపయోగించే అవశాలెక్కువని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ లెక్కలు తప్పనున్నాయి. డీజిల్ విష యంలో అదే జరిగింది. ఖరీఫ్‌లో డీఏపీ వినియోగం పెరిగితే జిల్లాలో రైతులకు ఇబ్బందులు ఎదురవు తాయన్న ఆందోళన నెలకొంది. యూరియా విషయం లోనూ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఖరీఫ్‌కు జిల్లాకు అవసరమైన యూరియాలో దాదాపు 65 శాతం నిల్వలున్నాయి. దాంతో ప్రస్తుతం ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఇక్క్డడ సీజన్ ప్రారంభ మైన తర్వాత కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రైతులకు పంపిణీపై షరతులు
ఇప్పటిదాకా ఆధార్ కార్డు తీసుకువెళ్లిన రైతులందరికీ ఎరువులు ఇచ్చేవారు. ఈసారి భూమి తమ పేరుతో ఉన్న రైతులు ఆధార్ కార్డుతో తీసుకువెళితే ఎరువులు విక్రయిస్తారు. అదికూడా సదరు రైతుకు ఎంత ఎరువు అవసరమో ఆన్‌లైన్‌లోనే తెలిసిపోనుంది. ఆ మొత్తం ఒకేసారి ఇవ్వరు. రైతు ఒక సాగులో మూడు పర్యా యాలు ఎరువును వినియోగిస్తారు. అన్ని సార్లు వెళ్లి ఎరువులను తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కృత్రిమ కొరతకు అవకాశం లేదు. పైగా డిమాండ్ ఏర్పడదని, రైతులకు సవ్యంగా ఎరువుల పంపిణీకి వీలుంటుంని కేంద్రం ఆశిస్తోంది. ఆ దిశగా ఎరువుల విక్రయాల్లో సంస్కరణలను తీసుకొస్తోంది.