చించినాడ వంతెనపై ఫెన్సింగ్
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:21 AM
చించినాడ వంతెనపై కిలో మీటరన్నర మేర ఉన్న వంతెన పొడువునా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
వరుస ఆత్మహత్యలతో అధికార యంత్రాంగం అప్రమత్తం
ఆరు అడుగుల ఎత్తు ఫెన్సింగ్‌కు ఎన్‌హెచ్ ఓకే
వంతెన పొడువునా సోలార్ లైట్లు
నరసాపురం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఇటీవల చించినాడ వంతెనపై చోటు చేసుకున్న వరుస ఆత్మహత్యలు ఉభయగోదావరి జిల్లా వాసుల్ని కలిచివేశాయి. ఇటువంటి సంఘటనలు జరగకుండా వంతెనపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నివర్గాల ప్రజలు, నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఉభయగోదావరి జిల్లా అధికార యంత్రాంగం ఎన్‌హెచ్ ఆధికారులతో చర్చించారు. కిలో మీటరన్నర మేర ఉన్న వంతెన పొడువునా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సుమారు ఆరు ఆడుగుల ఎత్తున ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండదు. దీనికి ఎన్‌హెచ్ అధికారులు ఓకే చెప్పారు. సంబంధించిన ప్రతిపాద నలు తయారు చేసి ఆమోదానికి ఢిల్లీ పంపించేందుకు అంగీకరిం చారు. వీటితో పాటు వంతెన పొడువునా ఇరువైపులా సోలార్ లైట్లు ఏర్పాటుకు, శిథిలమైన రోడ్డుపైన బీటీ రోడ్ పనులకు కూడా రెడీ అవుతున్నారు. వచ్చే నెలాఖరు కల్లా ఈ పనుల్ని పూర్తి చేస్తామని ఎన్‌హెచ్ ఇంజనీర్ వెంకటరమణ ఆంధ్రజ్యోతికి చెప్పారు. ఫెన్సింగ్ ఏర్పాటు తమ పరిధిలో లేదన్నారు. ప్రతిపాదనలు తయారు చేసి ఢిల్లీకి పంపిస్తున్నట్లు చెప్పారు.