బాబోయ్.. మేపలేం!
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:53 AM
పౌలీ్ట్ర రైతులకు రోజువారీగా పెరుగుతున్న మేత ధరలతో ఆర్థిక ఇబ్బందు లు తప్పడంలేదు..ధరలు ఒక్కసారిగా ఆకాశం వైపు పరు గులు తీయడంతో కోనుగోలు భారంగా ఉందని రైతులు వాపోతున్నారు.
బాబోయ్.. మేపలేం!
పౌలీ్ట్ర రైతులకు మేత ధరల భారం..
పెరిగిన మొక్కజొన్న, సోయా ధరలు
ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
తణుకు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి):పౌలీ్ట్ర రైతులకు రోజువారీగా పెరుగుతున్న మేత ధరలతో ఆర్థిక ఇబ్బందు లు తప్పడంలేదు..ధరలు ఒక్కసారిగా ఆకాశం వైపు పరు గులు తీయడంతో కోనుగోలు భారంగా ఉందని రైతులు వాపోతున్నారు. వేరుశనగ, సోయాబీన్, నూకలు, డీవోబీ, మొక్కజొన్న వంటి మేతలు పౌలీ్ట్ర కోళ్లకు మేతలో వాడు తుంటారు.ఆయా ధరలు కొంత కాలంగా ధరలు అమాం తంగా పెరిగిపోయాయి. దీంతో పౌలీ్ట్ర రైతులు కోళ్ల మేతల కొనుగోలుకు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు.
ఏడాదిగా ఇదే పరిస్థితి..
వేరుశనగ, సోయాబీన్, నూకలు, మొక్కజొన్న, డీవోబీ ధరలు కొంత కాలంగా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వేరుశనగ క్వింటా రూ.36 వేల నుంచి రూ.45 వేలకు పెరిగింది. సుమారు రూ.9 వేల వరకు వేరుశనగ పెరిగింది. సోయాబీన్ రూ.4వేల 500 నుంచి రూ.7 వేలకు పెరిగింది. రైస్ డీవోబీ రూ.16 వేల నుంచి 26 వేలకు పెరిగింది. నూకలు రూ.2వేల 200 నుంచి రూ.3 వేల100 వరకు పెరిగింది. మొక్కజోన్న రూ.2వేల 400 నుంచి రూ.3వేల 600వరకు పెరిగింది.
ధర పెరిగినా మేత కొరతే..
ధరలు భారీగా పెరిగినా రైతులకు కావాల్సినంత మే రకు దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. నూకలు అతి కష్టం మీద కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న ఆంద్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రైతు లు పండిస్తుంటారు. పండిన పంటను రైతులు విత్తనాల నిమిత్తం ఉంచడం, విక్రయించడంతో మొక్కజొన్నకు గిరాకీ పెరిగింది. అలాగే నూకలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి బీరులు తయారీలో వినియోగించడంతో తమకు దొరకడం లేదని పలువురు రైతులు చెబుతున్నారు. ఇప్ప టికి రైతులు దాణాలకు అవసరమైన మొక్కజొన్న, నూకలు కొరతను దృష్టిలో ఉంచుకుని, కొనుగోలు చేయాలని భావించినా అవసరమైన సరకు సరఫరాలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. జిల్లా వ్యాప్తంగా పౌలీ్ట్ర పరిశ్రమలో 220 మంది రైతులు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారు. రూ.కోటి 20లక్షల వరకు కోళ్లు ఉన్నాయి.
కృత్రిమ కొరతతో ఇక్కట్లు..
పంట వచ్చిన తరువాత రైతులు సహజంగా అమ్మ కాలు చేస్తుంటారు. చాలామంది ముందుగానే రుణాలు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. దీంతో వ్యాపారులు అందిన కాడికి రైతుల నుంచి కొనుగోలు చేసి, నిల్వలు చేస్తుంటారు. రైతుల పంట పూర్తిగా అయ్యే వరకు నిల్వ చేస్తారు. రైతుల వద్ద లేదన్న తర్వాత కృత్రిమ సృష్టిం చడం పరిపాటిగా మరిపోయింది. దీని వల్ల రైతులు అనువైన ధరలు కాకుండా దళారులు చెప్పిన ధరలకు కొనుగోలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందు వల్ల ప్రభుత్వం దళారీలను నిర్మూలించడం ద్వారానే రైతులకు మేలు జరుగుతుంది.
ప్రభుత్వం రాయితీలు కల్పించాలి
పౌలీ్ట్ర రైతులకు అవసరమైన మేతను ప్రభుత్వం రాయితీ ద్వారా అందించాలి. ముఖ్యంగా వేరుశనగ, సోయాబీన్, డీవోబీ, మొక్కజొన్న వంటి వాటిపై ప్రభుత్వం రాయితీ కల్పించాలి. పరిశ్రమ చాలా ఒడిదుడుకుల నడుమ కొనసాగిస్తున్నాం. ప్రతి ఏటా ఏదో ఒక సందర్భంలో రైతలు నష్టపోతూనే ఉన్నారు. అయినా నమ్ముకున్న రంగాన్ని వీడలేక చాలా మంది రైతులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పౌలీ్ట్ర రంగంలో ఉన్న వారికి నిర్వహణ భారం ఎక్కువ అవ్వడం వల్ల ప్రభుత్వం రాయితీలు ప్రకటించి పౌలీ్ట్ర రైతులను ఆదుకోవాలి.
కొమాట్లపల్లి వెంకట సుబ్బారావు, పౌలీ్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు