Share News

గ్రామాల్లో పెరుగుతున్న దొంగల భయం

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:53 AM

ఇటీవల మొగల్తూరు, పరిసర గ్రామాల్లో వరుస చోరీలు జరుగుతుండటంతో దుకాణదారులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల మొగల్తూరులో నాలుగు దుకా ణాల్లో చోరీ జరిగింది.

గ్రామాల్లో పెరుగుతున్న దొంగల భయం

గ్రామాల్లో పెరుగుతున్న దొంగల భయం

పోలీసులు గస్తీ నిర్వహించాలంటూ ప్రజల డిమాండ్‌

మొగల్తూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి):ఇటీవల మొగల్తూరు, పరిసర గ్రామాల్లో వరుస చోరీలు జరుగుతుండటంతో దుకాణదారులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల మొగల్తూరులో నాలుగు దుకా ణాల్లో చోరీ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి పురోగతి లేదని వ్యాపారులు వాపోతున్నారు. తాజాగా మొగల్తూరులో మళ్లీ దొం గలు పడి కిరాణా దుకాణం, కరెంట్‌ మోటార్ల షాపులో దొంగలు పడి రూ.4లక్షల విలువైన సామగ్రి దోచుకుపోయినట్టు దుకాణదారుడు అందే నరేశ్‌ వాపోయాడు. తూర్పుతాళ్ళు, ఎల్‌బీచర్ల, పీఎంలంక, కాళీపట్నంలో లక్షలాది రూపాయల విలువైన కోళ్లను అపహరించుకుపోయారు. ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వేలేరుపాడులో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..

వేలేరుపాడు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి):గుర్తు తెలియని నలుగురు వ్య క్తులు సోమవారం అర్ధరాత్రి ఒక ఇంట్లోకి చోరీకి యత్నించి విఫలమ య్యారు. వేలేరుపాడు మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలో ఈ ఘటన జరిగింది. కారం సీతయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన ఆగంతకులు సీతయ్య, సీతయ్య భార్యను గొంతునొక్కి బంధించేందుకు ప్రయత్నించా రు. భయంతో వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో ఆగంతుకులు పరారయ్యారు. వెంట తెచ్చుకున్న గునపాలు, ఒక కత్తి, నా లుగు కర్రలు, తాళ్లు అక్కడే వదిలి పరారయ్యారు. స్థానిక క్రికెట్‌స్టేడియం వద్ద నిలిపి ఉంచిన కారులో ఎక్కి వేగంగా వెళ్లిపోయినట్టు బాధితుడు సీతయ్య తెలిపారు. ఈ ఘటనపై పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆర్థికంగా బలం లేని వీళ్లను బంధించే అవసరం ఏం వచ్చిందని గ్రామ స్థులు చర్చించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పెదఅమిరం ప్రధాన కూడలిలో..

కాళ్ళ: పెదఅమిరం ప్రధాన కూడలిలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు.రోడ్డు పక్కన ఉన్న ఏడుకొండలు ఎలక్ట్రికల్‌ రివైండింగ్‌ వర్క్‌ షాపులో చోరీకి పాల్పడ్డారు. షాప్‌ ముందుసీసీ కెమెరా కేబుల్స్‌ కట్‌ చేసి లోపల ఉన్న విలువైన విద్యుత్‌ మోటార్లు, కాపర్‌ వైర్లు కారులో వేసుకుని పారిపోయేందుకు ఇద్దరు దొంగలు ప్రయత్నం చేశారు. అదే సమయంలో గమనించిన స్థానికులు ఒకరిని పట్టుకోగా మరొకరు కారులో పరారైనట్టు సమాచారం. పట్టుకున్న వ్యక్తి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.రాత్రి పూట పోలీస్‌ గస్తీ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Aug 11 , 2026 | 12:53 AM