ఆక్వా రాయితీ ఎప్పుడు ?
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:44 AM
ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ అమ లు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
2451 మందికి పెండింగ్.. మత్స్య శాఖ నుంచి విద్యుత్‌కు అందని జాబితా
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. సబ్సిడీ విద్యుత్‌కు జాప్యం జరుగుతోంది ఎక్కడ ?
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ అమ లు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. జిల్లాలో ఎన్ని ఎకరాల్లో సాగు జరుగుతోంది ? ఎవరు చేస్తున్నారు ? ఎక్కడ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి ? తదితర వివరాలను మత్స్యశాఖ అధి కారులు విద్యుత్ శాఖకు అందించాలి. కాని ఇప్పటి వరకు అందించకపో వడంతో కనెక్షన్‌ల జారీలో జాప్యం జరుగుతోంది. విద్యు త్ రాయితీ కోసం ప్రభుత్వం నాన్ ఆక్వా జోన్‌లో చెరువుల ను జోన్ పరిధిలోకి తీసుకు వచ్చింది. పది ఎకరాలకు పై బడిన రైతులకు అమలుచే యాలని నిర్ణయించింది. రా యితీ అమలులోకి వచ్చే వరకు రైతులు యూ నిట్‌పై రూ.3.95 చెల్లించాలి. తర్వాత రూ.1.50 చెల్లిస్తే సరిపోతుంది. జిల్లాలో 16,710 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు వుండగా 14,259కు రాయితీ వస్తోంది. మిగిలిన 2,451 కనెక్షన్‌లకు రాయితీ ఇవ్వాలి. వీరిలో పది ఎకరాలకు పైబడి వున్న వారు 1133 మంది, నాన్‌ఆక్వాజోన్ కింద సాగు చేస్తున్న వారు 959 మంది, కొత్తగా కనెక్షన్‌లకు దరఖాస్తు చేసుకున్న వారు 359 మంది వున్నారు. ప్రభుత్వం వరమిచ్చినా.. అధికారి కరుణించని చందాన ప్రస్తుత పరిస్థితి వుందని ఆక్వా రైతులు ఆందోళన చెందు తున్నారు. ఇప్పటికే ఆక్వా సాగు తీవ్ర ఒడిదు డుకులకు లోనవుతోంది. ఇటీవల మేత ధరలు పెరిగాయి. రొయ్య ధరలు తగ్గాయి. సీడ్ నాణ్యత లోపించి నష్టాల్లో మునిగి తేలుతున్నారు. సీడ్, ఫీడ్‌లోనూ నాణ్యత ఉండడం లేదు. తక్కువ ధరలకు వస్తు న్నాయని రైతులు కొనుగోలు చేసుకుంటున్నా రు. నిండా మునిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ రాయితీ లభిస్తే వారికి ఎంతో ఊరట కలుగుతుంది. అధికారులు స్పందించాలి.