విత్తన కంపెనీల వల్ల నష్టపోయాం
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:43 AM
అధిక దిగుబడులు వస్తాయంటూ నమ్మబలికి రైతుల కు మిర్చి విత్తనాలు అంటగట్టి మోసం చేసిన అగ్రిమాజెనటిక్స్ కంపెనీ యాజమానులపై వ్య వసాయ శాఖాధికారులు వేలేరుపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విత్తన కంపెనీల వల్ల నష్టపోయాం
వేలేరుపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
వేలేరుపాడు, జూలై 22(ఆంధ్రజ్యోతి): అధిక దిగుబడులు వస్తాయంటూ నమ్మబలికి రైతుల కు మిర్చి విత్తనాలు అంటగట్టి మోసం చేసిన అగ్రిమాజెనటిక్స్ కంపెనీ యాజమానులపై వ్య వసాయ శాఖాధికారులు వేలేరుపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి హబీబ్ బాష, వ్యవసాయ శాఖ స హాయ సంచాలకులు బుజ్జిబాబు,రైతులు బుధ వారం ఈ ఫిర్యాదు అందజేశారు. అగ్రిమాజెన టిక్స్ కంపెనీకి చెందిన బిందాస్ 502 రకం మి నపవిత్తనాలను తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సులూరుపాడు మండలానికి చెందిన మహేశ్ సీడ్స్ వద్ద వేలేరుపాడు మం డలానికి చెందిన 25మంది రైతులు గత ఏ డాది వ్యవసాయ సీజన్‌లో కొనుగోలు చేశారు. విత్తన కంపెనీ ఏజెంట్లు, మిర్చిపంట ఎకరానికి 25 – 30 క్వింటాళ్లు పైనే దిగుబడి వస్తుందని నమ్మబలకడంతో 30 ఎకరాల్లో సాగు చేశారు. పంట చేతికి వచ్చే దశలో కూడా పూత, కాయ లు కాయకపోగా చెట్లు మాత్రం ఏపుగా పెరి గాయి. దీంతో రైతులు ఎకరానికి 2, 3 క్వింటా ళ్లు కూడా దిగుబడి రాకపోవడంతో ఎకరానికి రూ.2 లక్షల మేరా నష్టపోయారు. విత్తన కం పెనీ యజమానుల మోసంపై వ్యవసాయ శాఖా ధికారులకు ఫిర్యాదు చేయగా వారు శాస్త్రవేత్త లతో మినపపంటను పరిశీలించి నకిలీవిత్తనాల కారణంగానే పంటదిగుబడి రాలేదని తేల్చారు. దీంతో వ్యవసాయ శాఖాధికారులు సంబంధిత విత్తన కంపెనీ యజమానులను పిలిపించి మరో సారి పంటలను వారి సమక్షంలోనే పరి శీలించగా జరిగిన నష్టానికి బాధ్యత వహించి ఎకరాకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లి స్తామని అంగీకరించారు.ఆ పరిహారం చెల్లిం చకుండా తప్పించుకు తిరుగుతున్నారు. సం ప్రదించేందుకు ప్రయత్నం చేసినా కంపెనీ యజమానుల నుంచి ఎలాంటి స్పందన రాలే దు. దీనిపై రైతులు మరోసారి జిల్లా వ్యవసా య శాఖాధికారులకు పిర్యాదు చేయగా బుధ వారం రైతులతో కలిసి సదరు విత్తన కంపెనీ యాజమానులపై పోలీస్ స్టేషన్‌లో ఎస్సైకి ఫిర్యాదు చేశారు. రైతులను మోసం చేసినా విత్తన కంపెనీ యాజమానులను అదుపులోకి తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఏడీఏ బుజ్జిబాబు, ఏవో కె.గంగాధరం, రైతులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.