రైతుల చెంతకు..
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:43 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం సోమవారం జిల్లాలో అట్టహాసంగా ప్రారంభ మైంది. సోమవారం నుంచి ఆరురోజుల పాటు వ్యవసాయ శాఖాధికారులు, ఉద్యోగులు రైతుల ఇంటింటికీ వెళ్లి అవ గాహనా కార్యక్రమాలు నిర్వహించడం ఈ కార్యక్రమం ముఖ్యో ద్దేశ్యం.
76 శాతం రైతుల కుటుంబాలను కలిసిన వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు
అమలవుతున్న పఽథకాలపై అవగాహన
ఉత్సాహంగా పాల్గొన్న 80 వేల 374 మంది
రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచిన జిల్లా
(ఏలూరుసిటీ – ఆంరఽధజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం సోమవారం జిల్లాలో అట్టహాసంగా ప్రారంభ మైంది. సోమవారం నుంచి ఆరురోజుల పాటు వ్యవసాయ శాఖాధికారులు, ఉద్యోగులు రైతుల ఇంటింటికీ వెళ్లి అవ గాహనా కార్యక్రమాలు నిర్వహించడం ఈ కార్యక్రమం ముఖ్యో ద్దేశ్యం. ఎల్‌నినో ప్రభావం, నివారణా చర్యలు, ఏపీ ఎయిమ్స్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎరువులు పంపిణీ, పంటల వైవిధ్యకరణపై ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు రైతులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా తీసుకుంది. వ్యవసాయ, అనుబంధ శాఖ ఉద్యోగులు రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమా నికి రైతు సేవా కేంద్రాల వ్యవసాయ, ఉద్యాన సహాయకులు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి టీమ్ 30 క్లస్టర్లు తిరిగి రోజుకు 90 ఇళ్లను సందర్శిస్తారు. అభ్యుదయ రైతులు, సహకార సంఘాలు, సాగునీటి సంఘాలు, మార్కెట్ యార్డ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎల్‌నినో కార ణంగా వర్షపాతం తగ్గుదల, పంటలకు నీటి ఎద్దడికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం, చిరు ధాన్యాల పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.
రాష్ట్రంలో మూడవ స్థానం : జిల్లాలో సోమవారం ప్రారంభమైన రైత న్నా మీకోసం కార్యక్రమం నిర్వహణలో జిల్లా రాష్ట్రంలోనే మూడవ స్థానా న్ని సాధించింది. జిల్లాలో 28 మండలాలకు సంబంధించి లక్షా 60 వేల 971 రైతు కుటుంబాలను ఈ కార్యక్రమంలో కలవాల్సి ఉంది. తొలిరోజు సోమవారం 375 ఆర్‌ఎస్‌ల పరిఽధిలో 33 వేల 750 కుటుంబాలను కలవా ల్సి ఉండగా 20 వేల 273 రైతు కుటుంబాలను వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది కలిసి అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా 109 శాతంతో ప్రథమ స్థానం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 77శాతంతో ద్వితీయ స్థానం, ఏలూరు జిల్లా 76 శాతంతో తృతీయ స్థానం సాధించాయి. ఈ కార్యక్రమంలో జిల్లాలో 80 వేల 736మందికి కలిసి వారిలో అవగాహన కల్పించారు. కలెక్టర్ కె.వెట్రి సెల్వి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ షేక్ హబీబ్‌బాషా తెలిపారు. రైతు కుటుం బాలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ పరంగా రైతులకు అందజేస్తున్న సంక్షేమ ఫలాలను వారికి వివరిస్తున్నట్టు తెలిపారు.