Share News

నకిలీ దర్శనం టిక్కెట్ల వ్యవహారంలో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:12 AM

చినవెంకన్న ఆలయం లో ఇటీవల జరిగిన రూ.200 నకిలీ టిక్కెట్ల వ్యవ హారంలో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

నకిలీ దర్శనం టిక్కెట్ల వ్యవహారంలో ఇద్దరి అరెస్టు

పరారీలో ప్రధాన నిందితుడు

ద్వారకాతిరుమల, మార్చి 27(ఆంధ్రజ్యోతి):చినవెంకన్న ఆలయం లో ఇటీవల జరిగిన రూ.200 నకిలీ టిక్కెట్ల వ్యవ హారంలో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ గోల్‌మాల్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఐఎస్‌జే రాజు పరారీలో ఉన్నాడు. అతనికి పూర్తిగా సహకరిం చారన్న ఆరోపణలపై అవుట్‌ సోర్సిం గ్‌ ఉద్యోగి సముద్రాల శేషుబాబు, సెక్యూరిటీ గార్డు మేకా సతీష్‌లను విచారణ అనం తరం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చగా వారికి రిమాండ్‌ విధించింది. ఈనెల 15న కొందరి భక్తుల శ్రీవారి దర్శనం టిక్కెట్లు స్కానింగ్‌ పాయింట్‌ వద్ద స్కాన్‌ కాకపోవడంతో ఈ టిక్కెట్ల గోల్‌మాల్‌ వ్యవహారం వెలుగు చూసిన విషయం విదితమే. ఆ రోజు 61 నకిలీ టిక్కెట్లు దొరికాయి. అవి దేవస్థానం వాడుకలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ద్వారా వచ్చినవి కావని అధికారులు తేల్చారు. ఇందుకు బాధ్యులైన వారిపై కేసు పెట్టారు. పోలీసులు విచారణ చేపట్టి వీరిద్దరిని అరెస్ట్‌ చేశారు.

Updated Date - Mar 28 , 2026 | 12:12 AM