Share News

చౌక డిపోలు..ఇక మీ–మార్ట్‌లు

ABN , Publish Date - Aug 05 , 2026 | 01:40 AM

రేషన్‌ దుకాణాల్లో బియ్యం, పంచదారతో పాటు అవసరమైన నిత్యవసర వస్తువులను తక్కువ ధరకు అమ్మకానికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

చౌక డిపోలు..ఇక మీ–మార్ట్‌లు

15న ప్రారంభించేందుకు చర్యలు

6న కలెక్టరేట్‌లో డీలర్లకు అవగాహన

భీమవరం టౌన్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : రేషన్‌ దుకాణాల్లో బియ్యం, పంచదారతో పాటు అవసరమైన నిత్యవసర వస్తువులను తక్కువ ధరకు అమ్మకానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మీ–మార్టులను ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 100 షాపులు ఏర్పాటు చెయ్యాలని లక్ష్యం కాగా డీలర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. దాదాపు 141 మంది డీలర్లు తమ చౌక దుకాణాలను మీ–మార్టులుగా మార్పు చేసుకునేందుకు ముందుకు వచ్చారు. రేషన్‌ తీసుకునేందుకు వచ్చిన సమయంలో అవసరమైన ఇతర సరుకుల కోసం వేరే షాపులకు వెళ్ళకుండా చౌక్‌ డిపోల వద్దే తక్కువ ఽధరకు సరుకులు అందిచేలా మార్టులను ఏర్పాటు చెయ్యనున్నారు. ఈనెల 15న జిల్లాలో మీ–మార్టులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజల నుంచి స్పందన బాగుండటంతో పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టారు.

జిల్లాలో 141 మార్ట్‌లు

జిల్లాలో 1,052 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటిలో 100 చోట్ల మార్టులను ఏర్పాటు చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే డీలర్ల నుంచి మంచి స్పందన రావడంతో 141 మంది మొదటి విడతలో ముందుకు వచ్చారు. ఇందులో 137 మంది బ్యాంకు రుణం ద్వారా ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోగా మరో నలుగురు సొంత నిధులతో షాపులు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. దరఖాస్తులు చేసుకున్న డీలర్లు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మార్ట్‌కు కావలసిన రాక్స్‌, బోర్డులు, ఇతర వాటిని ప్రంటియర్‌ మార్కెట్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌ సంస్ధ అందిస్తుంది.

6న కలెక్టరేట్‌లో శిక్షణ..అవగాహన

మీ– మార్టులు ఏర్పాటుకు మందుకు వచ్చిన డీలర్లకు ఈనెల 6న కలెక్టరేట్‌లో షాపు నిర్వహణ౅, యాప్‌లపై ప్రంటియర్‌ మార్కెట్స్‌ సంస్ధ ప్రతినిధులు అవగాహన కల్పించనున్నారు. యాప్‌ ద్వారా సరుకులను ఎలా బుక్‌ చేసుకోవాలి, అమ్మిన సరులకు యాప్‌లో ఎలా నమోదు చేసుకోవాలని, ఆన్‌లైన్‌ పేమెంట్‌ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాకుండా బుక్‌ చేసుకున్న సరుకులను సంస్ధ త మడిపోల నుంచి ఉచితంగా డోర్‌ డెలివరీద్వార షాపు కు అందించనున్నారు. దీనిపై ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.. షాపు వద్ద బోర్డులు వంటివి ఈ సంస్ధ ఏర్పాటు చేస్తుంది. షాపు ఏర్పాటు చేసుకునేవారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. రూ.లక్ష అందిస్తే అందులో రూ.10 వేలు ఈ సంస్ధకు తీసుకుని కొన్ని సదుపాయాలను కల్పించనుంది.

నియోజకవర్గాల వారీగా..

భీమవరం నియోజకవర్గంలో 12 ఏర్పాటు చేస్తుండగా భీమవరంలో 10, వీరవాసరంలో 2, ఉంగు టూరు నియోజకవర్గంలో గణపవరంలో 5, ఉండి నియోజకవర్గంలో 17 మార్టులకు ఉండిలో 3, ఆకివీడులో 9, కాళ్ళలో 3, పాలకోడేరులో 2, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 18 మార్టులకు తాడేపల్లిగూడెంలో 9, పెంటపాడులో 9, తణుకు నియోజకవర్గంలో 9 ఏర్పాటు చేస్తుండగా తణుకులో 5, ఇరగవరంలో 2, అత్తిలిలో 2 ఏర్పాటు చేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గంలో 33 మార్టులకు నరసాపురంలో 24, మొగల్తూరులో 9 ఏర్పాటు చేస్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో 32 ఏర్పాటు చేస్తుండగా పాలకొల్లులో 14, యలమంచిలిలో 6, పోడూరులో 12 ఏర్పాటు చెయ్యనున్నారు. ఆచంట నియోజకవర్గంలో 15 మార్టులకు ఆచంటలో 3, పెనుమంట్రలో 2, పెనుగొండలో 5, పోడూరులో 5 ఏర్పాటు చెయ్యనున్నారు.

Updated Date - Aug 05 , 2026 | 01:40 AM