మెరుగైన వైద్య సేవలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:38 AM
ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్‌లో మరింత మెరుగైన సేవలు లభించనున్నా యని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
పాలకొల్లు డయాలసిస్ సెంటర్లో అదనపు బెడ్స్ ప్రారంభించిన మంత్రి నిమ్మల
పాలకొల్లు అర్బన్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్‌లో మరింత మెరుగైన సేవలు లభించనున్నా యని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్లో అదనపు 2 బెడ్లను ఆదివారం కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల ప్రారంభించారు. వైద్య సేవలు పొందుతున్న బాధితులతో సేవలపై ఆరా తీశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు పాలకొల్లులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు కోరినట్లు మంత్రి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన 2 డయాలసిస్ సెంటర్లలో పాలకొల్లు ఒకటి అని మంత్రి వివరించారు. 5 బెడ్స్‌తో ప్రారంభించగా ప్రస్తుతం 9బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈసెంటర్ సుమారు 100 కిలో మీటర్ల పరిధిలోని బాధితులకు ఉపయోగపడుతోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సూపరిండెంటెంట్ డాక్టర్ యర్రా మాధురి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్, నాయ కులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, కర్నేన గౌరునాయుడు, కర్నేన రోజారమణి, ఉన్నమట్ల కపర్ధి, బోణం చినబాబు, తులా రామలింగం, కె.కొండ ప్రసాద్, జక్కంపూడి కుమార్, చినమిల్లి గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు.