Share News

రెండేళ్ళ పాలనను ప్రజలకు వివరించాలి: కామినేని

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:26 AM

కూటమి ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అన్నారు.

రెండేళ్ళ పాలనను ప్రజలకు వివరించాలి: కామినేని
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌

కైకలూరు, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అన్నారు. శనివారం కైకలూరులో ఎన్డీయే కూటమి ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 16న జిల్లాస్థాయి సమావేశాన్ని ఏలూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి నేతలంతా భారీగా తరలివెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే నియోజకవర్గస్థాయిలో ఈ నెల 19న సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. 16న ఉదయం 8గంటలకు కైకలూరు ట్రావెలర్స్‌ బంగ్లా నుండి ఏలూరు తరలివెళ్లాలన్నారు. అలాగే 19వ తేదీన సాయంత్రం 4గంటలకు కైకలూరు మార్కెట్‌యార్డ్‌ నుండి ట్రావెలర్స్‌బంగ్లా వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఏలూరు సభకు నాలుగు మండలాల నుండి ప్రత్యేక టీంలను ఏర్పాటుచేసుకుని భారీగా నాయకులు తరలివెళ్లాలన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 01:26 AM