Share News

ప్రజా భాగస్వామ్యంతోనే సమగ్రాభివృద్ధి

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:51 AM

పశ్చిమ పచ్చని పాడి పంటలు, శ్రమించే రైతు లు, అపారమైన మత్స్య సంపద, చేనేత, పర్యా టక రంగాలతో దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలు స్తోందని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు డాక్టర్‌ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

ప్రజా భాగస్వామ్యంతోనే సమగ్రాభివృద్ధి
జెండాను ఆవిష్కరించి వందనం చేస్తున్న మంత్రి నిమ్మల, చిత్రంలో కలెక్టర్‌ నాగరాణి..

అందుబాటులో 54,455 మెట్రిక్‌ టన్నుల ఎరువులు

ఆక్వా ఫీడ్‌ ధరల తగ్గింపు.. రూపాయిన్నరకే విద్యుత్‌

అన్నదాత సుఖీభవ కింద రూ.207.52 కోట్లు జమ

తల్లికి వందనం కింద తల్లుల ఖాతాల్లో రూ.295 కోట్లు

విద్యార్థులకు మెరుగైన వసతులు.. నాణ్యమైన ఆహారం

4,033 పరిశ్రమల ఏర్పాటు.. 13,392 మందికి ఉపాధి

మహిళా సంఘాలకు రుణ పరిమితి పెంపు : స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి నిమ్మల

భీమవరంటౌన్‌, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): పశ్చిమ పచ్చని పాడి పంటలు, శ్రమించే రైతు లు, అపారమైన మత్స్య సంపద, చేనేత, పర్యా టక రంగాలతో దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలు స్తోందని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు డాక్టర్‌ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. భీమవరం పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్‌ నాగరాణితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రగతిని వివరించారు.

డెల్టా ఆధునికీకరణకు నిధులు

‘పిల్లల భవిష్యత్తు, పచ్చని పల్లెల ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి. రాష్ట్రాన్ని, పశ్చిమ గోదావరి జిల్లాను ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌’గా తీర్చిదిద్దేందుకు సహకరించాలి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయం, పారిశ్రామిక, పర్యాటక, సంక్షే మ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోంది. డెల్టా ఆధునికీకరణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాం. గత ఏడాది 332 పనులకు రూ.12.69 కోట్లు మంజూరు చేస్తే 2026–27లో 535 పనుల కు రూ.28.40 కోట్లు కేటాయించి పనులు చేస్తు న్నాం. వరద రక్షణ చర్యల్లో రూ.28.03 కోట్లతో వరద కరకట్టల పనులు వేగవంతం చేశాం. గోదావరి పుష్కరాల కోసం రూ.31.54 కోట్లతో పుష్కర ఘాట్‌ పనులు చేపట్టనున్నాం. ఖరీఫ్‌లో 2,19,511 ఎకరాల్లో సాగు చేయాలి. ఇప్పటి వరకు 1,80,372 ఎకరాల్లో పూర్తయింది. 54,455 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో వుంచాం. కౌలు రైతులకు భరోసా కల్పించేందుకు అవసరమైన 43,338 సీసీఆర్సీ కార్డులు జారీ చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా రెండేళ్లలో 1,03,761 మంది రైతులకు రూ.207.52 కోట్లు ఖాతాల్లో జమచేశాం. వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.2.89 కోట్ల సబ్సిడీతో పరికరాలు ఇచ్చాం. రబీలో 7,82,118 మెట్రిక్‌ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసి రూ.1,855.80 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఆక్వా రైతులకు మద్ద తుగా ఫీడ్‌ ధరలు తగ్గించడంతోపాటు ప్రతి ఆక్వా రైతుకు రూ.1.50 పైసలకే యూనిట్‌ విద్యుత్‌ను అందిస్తున్నాం. మత్స్యకార కుటుం బాలకు వేట నిషేధ కాలంలో ఆర్థిక సహాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచి జిల్లాలో 1,7744 కుటుంబాలకు రూ.3.57 కోట్ల ఆర్థిక సహాయం చేశాం.

పౌరసరఫరాల శాఖలో సంక్షేమం

దీపం–2 పథకం ద్వారా నాలుగు విడతల్లో రూ.140 కోట్ల గ్యాస్‌ సబ్సిడీని లబ్ధిదారుల బ్యాం కు ఖాతాల్లో జమ చేశాం. జూలైలో ఎన్‌.టి.ఆర్‌ భరోసా పథకం కింద వృద్ధాప్య, వితంతు, ఒంట రి మహిళలు 2,20,227 మంది లబ్ధిదారులకు రూ.96.02 కోట్ల పెన్షన్లు పంపిణీ చేశాం. మహి ళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు రుణ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచడంతోపాటు వడ్డీ లేని రుణాలను ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో ఈ ఏడాది 15,726 సంఘాలకు రూ.2,609.58 కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలు అందించాం.

‘పల్లె పండుగ’లో పీపీపీ పద్ధతిన రూ.116 కోట్లు వెచ్చించి 1568 సీసీ, బీటీ రోడ్లు, 1190 పశు, కోళ్ల షెడ్ల నిర్మాణాలను పూర్తిచేశాం. జిల్లా లో 86,258 మంది విద్యార్థులకు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పథకం కింద ఉచిత విద్యా కానుక కిట్లు అందించి రూ.26.93 కోట్లు ఖర్చు చేశాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా 87,142 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరానికి 2,26,566 మంది విద్యార్థులకు రూ.295 కోట్లు తల్లుల ఖాతాలో జమ చేశాం.

వైద్యం రంగంలో విస్తృత సేవలు

18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో 379 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల ద్వారా ప్రాథమిక వైద్య సేవలు, 63 రకాల ల్యాబ్‌ పరీక్షలు అందు బాటులోకి తెచ్చాం. 108 అంబులెన్స్‌ సేవల ద్వారా 12,411 మంది ప్రాణాలను రక్షించాం. భీమవరం ఏరియా ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ మెడికల్‌ బ్లాక్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

గృహ నిర్మాణం, మౌలిక వసతులు

తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణు కు పట్టణాల్లో మొత్తం 20,784 ఎన్టీఆర్‌ టిడ్కో ఇళ్లు మంజూరుచేశాం. పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడంతోపాటు తాగు నీరు, డ్రైనేజ్‌, ఎస్‌టీపీ, వీధి దీపాలు, అంగన్‌వాడీ, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రైతు బజార్లు, బ్యాంకులు వంటి మౌలిక సదుపా యాలు కల్పించాం. గత ఏడాదిలో జిల్లావ్యాప్తం గా 4,033 కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా 13,392 మందికి ఉపాధి లభించింది.

ఇంటింటికి సురక్షిత తాగునీరు

తాగునీరు, రోడ్లు, పంచాయతీరాజ్‌ అభివృద్ధి జలజీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ సురక్షిత తాగు నీరందించేందుకు 1488 పనులకు రూ.335.75 కోట్లు మంజూరుచేశాం. ఇప్పటి వరకు 890 పనులు పూర్తయ్యాయి. పంచాయతీ రాజ్‌శాఖలో 1295 పనులకు రూ.310,42 కోట్లు కేటాయించాం. అందులో 1,111 పనులు పూర్తి కావచ్చాయి. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో 1574 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, నిర్వహణ కు రూ.431.93 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. పనులు పురోగతిలో ఉన్నాయి. స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం.

సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం

సామాజిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందిస్తున్నాం. ఎస్సీ విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు రూ.82.86 కోట్లు విడుదల చేయగా, బీసీ విద్యార్థులకు ఆర్‌.టి.ఎఫ్‌ కింద రూ.44.44 కోట్లు మంజూరుచేశాం. జిల్లాలో 1,626 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 15,738 మంది చిన్నారులకు ప్రీ–స్కూల్‌ విద్య, 13,377 మంది గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందిస్తున్నాం’ అని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి, జేసీ కేఆర్‌ కల్పశ్రీ, డీఆర్వో పి.ప్రభాకర్‌, ఆర్డీవో కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మార్వో రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వతంత్ర సమరయోధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 01:51 AM