స్థానిక కసరత్తు
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:50 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి తుదిజాబితాను ప్రచురించడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదివారం షెడ్యూలు విడుదల చేసింది.
సెప్టెంబరు 5న పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల తుది ఓటర్ల జాబితా ప్రచురణ జడ్పీ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీల వారీగా పోలింగ్ కేంద్రాలను గుర్తించే ప్రక్రియ
ఇప్పటికే పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలు గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ
పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించడానికి షెడ్యూలు విడుదల
(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి తుదిజాబితాను ప్రచురించడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదివారం షెడ్యూలు విడుదల చేసింది. ఇప్పటికే పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ, ఎంపీపీ, పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. పంచాయతీల్లో ఏప్రిల్ 15న జడ్పీ పంచా యతీ అధికారులు ప్రచురించిన ఓటర్ల జాబితాలను అనుసరించి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి , ఆ ఓటర్ల జాబితాలో మార్కింగ్ చేయాలని ఆపై తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాల వారీగా జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు షెడ్యూలును విడుదల చేశారు.
షెడ్యూలు ఇలా ..
ఈనెల 16వ తేదీ నుంచి 20 వతేదీ వరకు ఇంటింటి సర్వే ద్వారా ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్ల గుర్తింపు
21 నుంచి 22 వతేదీ వరకు ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లను ఓటర్ల జాబితాల్లో మార్కింగ్ చేయడం
23న ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితా ప్రచురణ
24 నుంచి 26వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
27 నుంచి 31 వరకు అభ్యంతరాలపై విచారణ చేసి తుది నిర్ణయం తీసుకోవడం
సెప్టెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు గ్రామ సభల్లో ఆ జాబితాల ధ్రువీకరణ
5న ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లను గుర్తించిన తుది ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ
ముఖ్యమైన విధివిధానాలు
ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లకు గుర్తింపు అధికారి : ప్రతి పంచా యతీకి ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్ల గుర్తింపునకు గుర్తింపు అధికారిని నియమించాలి. ఈ అధికారిని సంబంధిత పంచాయతీ కార్య దర్శి లేదా గ్రామ పంచాయతీ మినిస్టీరియల్ సిబ్బంది నుంచి జిల్లా పంచాయతీ అధికారి నియమిస్తారు. ఓటర్ల జాబితాలో ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లను ఎరుపు బాల్ పాయింట్ పెన్‌తో స్పష్టంగా మార్కింగ్ చేయాలి. ఇతర శాఖలు/ సంస్థలు అందించిన ఎస్సీ/ఎస్టీ/బీసీ జాబితాలతో క్రాస్ చెక్ చేయాలి.
ముసాయిదా జాబితా : గుర్తింపు చేసిన అసలు జాబితాను మాస్టర్ కాపీగా ఉంచి, దాని ఆధారంగా మరో కాపీ తయారు చేసి ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లతో కూడిన డ్రాఫ్ట్ ఎలకో్ట్రరల్ రోల్‌గా ప్రచురించాలి.
క్లెయిమ్స్ అండ్ అభ్యంతరాలు : ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటరుగా పేరు చేర్చాలని కోరే వారు ఫారం–2లో దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటరుగా చేర్చ డంపై అభ్యంతరముంటే ఫారం–3లో తెలపాలి. తన పేరు ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటరుగా చేర్చడం పై స్వయంగా అభ్యంతరం ఉంటే ఫారం–4ను ఉప యోగించాలి.
విచారణ: అభ్యంతరాలు/క్లెయిమ్‌లు విచారణ చేయ డానికి పంచాయతీ కార్యదర్శి, ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్ల గుర్తింపు అధికారి, పంచాయతీకి చెందిన మరో సిబ్బం దితో బృందం ఏర్పాటు చేయాలి. అవసరమైన అదనపు సిబ్బంది లేకపోతే మండలంలోని సిబ్బందిని సర్దుబాటు చేసి బృందాలను ఎంపీడీవో ఏర్పాటు చేయాలి. ఈ విచారణకు ఐదు రోజుల సమయం కేటాయించారు. ఎంపీడీవో, తహసీల్దార్, ఈవోపీఆర్డీ స్వతంత్రంగా కనీసం 10 క్లెయిమ్స్‌ను/అభ్యంతరాలను తనిఖీ చేసి విచారణ బృందాల నిర్ణయాలను పరిశీలించాలి. విచారణ అనం తరం అవసరమైన సవరణలు చేసి జాబితాను ప్రత్యే కంగా నిర్వహించే గ్రామ సభ ముందు ఉంచాలి. గ్రామ సభలో క్లెయిమ్స్, అభ్యంతరాలను చదివి వినిపించాలి. అవసరమైన సవరణలు చేసిన తర్వాత వాటిని గ్రామ సభకు హాజరైన సీనియర్ అధికారి ధ్రువీ కరించాలి. ప్రతి మండలంలోని అన్ని గ్రామ పంచా యతీల్లో గ్రామ సభలు 4 రోజుల లోపు పూర్తి చేయాలి.
తుది జాబితా: గ్రామ సభలో చేసిన సవరణలతో పాటు విచారణ బృందం చేసిన సవరణలను కలిపి కొత్తగా తుది ఓటర్ల జాబితా తయారు చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించాలి. ఈ తుది జాబితా సెప్టెంబరు 5న ప్రచురించాలి. ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత ఎస్సీ/ఎస్టీ/బీసీ మార్కింగ్ చేసిన ఓటర్ల జాబితాలో ఇకపై ఎటువంటి మార్పులు/ సవర ణలు చేయరాదని రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యం గా ఈ ప్రక్రియలో రోజువారీ పురోగతిని ఎంపీడీవో పర్య వేక్షిస్తారు. అన్ని పంచాయతీల్లో ప్రతి దశను, నిర్ణీత తేదీల్లో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీవోపై ఉంది. పంచాయతీ అధికారులు కూడా ప్రతి రోజు పురోగతిని సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాం
జీవీఎస్ మల్లికార్జునరావు, డీపీవో
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఓటర్ట జాబితాలో ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాం. నిర్దేశించిన సమయంలోనే ఈ జాబితాలను తయారు చేసి తుది ఓటర్ల జాబితాను సెప్టెంబరు 5న ప్రచురి స్తారు. పంచాయతీల్లో రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈ ప్రక్రియను నిర్వహించటం జరుగు తోంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్ల గుర్తింపు కార్యక్రమం పంచాయతీల్లో నిర్వహించటం జరుగుతుంది.
31 నాటికి పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 21లోగా పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా రూపొందించి, 23లోగా ఆ ముసాయిదా జాబితాను ప్రచురించాలి. 26వ తేదీలోగా అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించి 29న ఆమోదించాలి. 31న పోలింగ్ కేంద్రాల తుదిజాబితాను ప్రచురించాలి. జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అను గుణంగా పోలింగ్ కేంద్రా లను గుర్తింపు, జాబితాను తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.