సమ్మేటివ్ పరీక్షలకు సిట్టింగ్ స్క్వాడ్‌లా..!
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:19 AM
పదో తరగతి విద్యార్థు లకు సోమవారం నుంచి ప్రారంభమైన సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 (త్రైమాసిక) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి విద్యాశాఖ పరీక్షల విభాగం డైరెక్టరేట్ చేసిన ఓ ప్రయోగం ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత వ్యక్త మవుతున్నది.
పరిశీలకులుగా పది టీచర్ల నియామకాలు
అభ్యంతరం వ్యక్తం చేసిన ఫ్యాప్టో
ఏలూరు అర్బన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థు లకు సోమవారం నుంచి ప్రారంభమైన సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 (త్రైమాసిక) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి విద్యాశాఖ పరీక్షల విభాగం డైరెక్టరేట్ చేసిన ఓ ప్రయోగం ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత వ్యక్త మవుతున్నది. టెన్త్ పరీక్షలకు మిషన్ మార్చి–2027 పేరిట కార్యాచరణను చేపట్టిన విద్యాశాఖ ఎస్‌ఏ–1 పరీక్షల నుంచే ప్రణాళికను అమలు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో త్రైమాసిక పరీక్షల నిర్వహ ణతీరుని పర్యవేక్షించేందుకు స్కూల్ లెవెల్ అబ్జర్వర్ల(ఎస్‌ఎల్‌వో)ను నియమించింది. ప్రస్తుతం పదో తరగతి సబ్జెక్టులు బోధిస్తోన్న ఉపాధ్యా యులను ఇతర పాఠశాలలకు పంపించి, ఎస్‌ఏ పరీక్షలను పర్య వేక్షించడానికి నియమించింది. ఒక విధంగా టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్, చూచిరాతలు జరుగకుండా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నియ మించే సిట్టింగ్ స్క్వాడ్‌ల మాదిరిగానే ఎస్‌ఎల్‌వోలను నియమించినట్టుగా బావించవచ్చు. ఇలా ఎస్‌ఎల్‌వోల నియామకాలను కూడా పారదర్శకంగా జరపడానికి గూగుల్ మ్యాప్‌ను ప్రామాణికంగా తీసుకుని నియమిం చడంతో అదికాస్తా దారితప్పి ఒకొక్కరికి సగటున 50నుంచి 60 కిలో మీటర్ల దూరంలోని హైస్కూళ్లు/ పరీక్షకేంద్రాలు ఖరారయ్యాయి. ఆ మేరకు లాంగ్వేజ్ సబ్జెక్టుల పరీక్షలు జరిగే రోజుల్లో ఎస్‌ఎల్‌వోలుగా నాన్–లాంగ్వేజ్ సబ్జెక్టులు బోధించే టీచర్లను, నాన్–లాంగ్వేజ్ పరీక్షలకు లాంగ్వేజ్ టీచర్లను పరిశీలకులుగా నియమించారు. ప్రతి హైస్కూలు నుంచి ఇద్దరు లేదా ముగ్గురు వంతున ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు ఎస్‌ఎల్‌వోలుగా నియమించడం, దీనికితోడు సహ ఉపా ధ్యాయులనే పరిశీలకులుగా నియమించడంతో ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించేలా ఉండటం ఉపాధ్యాయవర్గాల్లో ఆగ్రహానికి, వ్యతిరేకతకు కారణమైంది. ఏలూరుజిల్లాలో ఇలా 287 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఎస్‌ఎల్‌వోలుగా 560 మందికిపైగా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ టీచర్లను నియమించారు. అబ్జర్వర్లుగా వ్యవహరించే టీచర్లంతా తమకు అప్పగిం చిన పర్యవేక్షక విధులు ముగిసిన తర్వాత తమ పాఠశాలలో ఎస్‌ఏ పరీక్ష లు రాసిన బాలబాలికల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి రావడం, దానికి గడువును నిర్దేశించడం మరింత వ్యతిరేకతను పెంచింది. ఎస్‌ఎల్‌వోల నియామక ఉత్తర్వులను దీపావళి పండుగరోజున జారీచే యగా, ఆ మరుసటిరోజే అంటే సోమవారమే సమ్మేటివ్ పరీక్షలు ప్రారం భంకావడం, దూరప్రాంతాలకు పర్యవేక్షక డ్యూటీలకు వెళ్లాల్సి రావడంపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) తీవ్ర అభ్యంతరాలను డీఈవో వెంకటలక్ష్మమ్మ దృష్టికి తీసుకెళ్లారు. దీనితో గరిష్టంగా 10 కిలో మీటర్ల దూరానికి లోబడి నియమించడానికి డీఈవో అంగీకరించారు. ఆ మేరకు మంగళవారం నుంచి సర్దుబాటుచేయనున్నారు.