ఈసెట్‌కు 685 మంది హాజరు
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:57 AM
పాలిటెక్నిక్ ఉత్తీర్ణులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశించేందుకు (లేటరల్ ఎంట్రీ) నిర్వహించే ఈసెట్–2026 ఆన్‌లైన్ పరీక్షలు గురువారం ఏలూరులోని మూడు కేంద్రాల్లో జరిగాయి.
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి):పాలిటెక్నిక్ ఉత్తీర్ణులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశించేందుకు (లేటరల్ ఎంట్రీ) నిర్వహించే ఈసెట్–2026 ఆన్‌లైన్ పరీక్షలు గురువారం ఏలూరులోని మూడు కేంద్రాల్లో జరిగాయి. సిద్థార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం సెషన్ పరీక్షకు 170 మంది విద్యార్థులకు 163, మధ్యాహ్నం సెషన్‌లో 100కి 95 మంది హాజరయ్యారు. ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేంద్రంలో ఉదయం ఒక సెషన్ మాత్రమే పరీక్ష నిర్వహించగా 165 మందికి 149 మంది, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో ఉదయం 200 మందికి 178, మధ్యాహ్నం 104 మందికి 100 మంది హాజరయ్యారు. మొత్తంమీద 739 మంది దర ఖాస్తు చేసుకోగా రెండు సెషన్లలో పరీక్షకు 685 మంది హాజరు కాగా 54 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష నిర్వహణలో సాంకేతిక సమస్యలేవీ తలెత్తలేదని, ప్రశాంతంగా ముగిసినట్టు నిర్వాహకులు తెలిపారు.