Share News

ఎర్రకాల్వను గుల్ల చేస్తున్నారు..

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:22 AM

ఎర్రకాలువ.. తాడేపల్లిగూడెం ప్రాంత రైతులపాలిట దుఃఖదాయిని.. అలాం టి ఎర్రకాలువ మట్టి, ఇసుకపై మాఫియా దందా చేస్తోంది.

ఎర్రకాల్వను గుల్ల చేస్తున్నారు..

అప్పారావుపేట, పట్టింపాలెం, వీరంపాలెంలో యథేచ్ఛగా మట్టి, ఇసుక తవ్వకాలు .. రూ. కోట్లలో దందా

తాడేపల్లిగూడెం రూరల్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఎర్రకాలువ.. తాడేపల్లిగూడెం ప్రాంత రైతులపాలిట దుఃఖదాయిని.. అలాం టి ఎర్రకాలువ మట్టి, ఇసుకపై మాఫియా దందా చేస్తోంది. ఒక పక్క పంట చేలను కాపాడుకునేందుకు గట్లు పటిష్టం చేయా లని ప్రభుత్వం యోచిస్తుంటే మట్టి, ఇసుక మాఫియా మాత్రం గట్లు గుల్ల చేసి సొమ్ము చేసుకుంటోంది. ముఖ్యంగా మండలంలోని వీరంపాలెం, సమీపంలోని నల్లజర్ల మండలం మధ్య మట్టి మాఫియా రాత్రి సమయాల్లో గట్లు గుల్ల చేసి మట్టి వ్యాపారం సాగిస్తు న్నారు. ఈ మాఫియా దెబ్బకు గతంలో పటి ష్ఠ పరిచిన గట్లు మాయం కాగా వాటితో పాటు కాలువ గర్భంలోని మట్టి మాయం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యారని ఆ ప్రాంత ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టింపాలెం, అప్పారావుపేట ప్రాంతంలో ఆయా గ్రామాల వారు ఒక మాఫియాగా ఏర్పడి కాలువ గర్భంలోని ఇసుకను దోచేస్తు న్నారు.. పోనీ ఉచిత ఇసుకే కదా అని వది లేస్తే కాలువ గర్బంలోని ఇసుక రవాణా చేసేందుకు గట్లను గుల్ల చేసి మార్గాలుగా చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవె న్యూ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో అప్రమత్తమై జిల్లా అధికారులు ఆదేశాలతో వీఆర్‌వోలకు రాత్రి విధులు ఏర్పాటు చేస్తే ఆ విధులు వీఆర్‌వోలకు కాసులు కురిపిం చాయనే ఆరోపణలు ఉన్నాయి.

కోట్లలో వ్యాపారం...

ఎర్రకాలువ పరివాహక గట్లు ఓ ప్రత్యేక మైన మట్టిని కలిగి ఉండటంతో ఈ మట్టికి మంచి డిమాండ్‌ ఉంది. ఎలాంటి అజ మాయిషీ లేకపోవడంతో మట్టిని అమ్ముకుని మాఫియా కోట్లలో గడించిందని ఆ ప్రాంత వాసులే చెప్పుకోవడం ఇక్కడి మట్టి ప్రత్యేకతగా చెప్పవచ్చు.

ఏడు ట్రాక్టర్లు సీజ్‌..

అప్పారావుపేటలో అక్రమ ఇసుక తవ్వకా లపై ఎర్రకాలువ అధికారులు శనివారం దా డులు నిర్వహించి అక్రమంగా ఇసుక తర లిస్తున్న 7 ట్రాక్టర్లను ఏఈ అనిల్‌ పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. జరిమానా విధించనున్నట్టు ఏఈ అనిల్‌ తెలిపారు.

Updated Date - Mar 29 , 2026 | 12:22 AM