Share News

ఈపీఎఫ్‌ పెన్షన్‌ రూ.7,500కు పెంచాలి

ABN , Publish Date - May 12 , 2026 | 12:35 AM

ఈపీఎఫ్‌ కనీస పెన్షన్‌ను రూ.7500కు పెంచి, ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యం (డీఏ) లింక్‌ చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని ఐఎఫ్‌టీయూ అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్‌ పెన్షనర్ల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

ఈపీఎఫ్‌ పెన్షన్‌ రూ.7,500కు పెంచాలి
ఏలూరు కలెక్టరేట్‌ వద్ద పెన్సనర్ల సంఘం, ఐఎఫ్‌టీయూ నాయకుల ఆందోళన

ఏలూరు రూరల్‌, మే 11(ఆంధ్రజ్యోతి) :ఈపీఎఫ్‌ కనీస పెన్షన్‌ను రూ.7500కు పెంచి, ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యం (డీఏ) లింక్‌ చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని ఐఎఫ్‌టీయూ అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్‌ పెన్షనర్ల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యక్షుడు పి.ప్రసాద్‌ మాట్లాడుతూ కార్మికులు తమ వేతనాల నుంచి దశాబ్ధాలుగా చెల్లించిన భవిష్యనిధిపై వచ్చే వడ్డీతోనే కనీస పెన్షన్‌ను ఇప్పటివరకు పెంచకపోవడం అన్యాయమని విమర్శించారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.పోలారి మాట్లాడుతూ పెన్షన్‌ పెంపుదల ప్రభుత్వ బాధ్యత అని, దానిని సాధించుకోవడం కార్మికుల హక్కు అని అన్నారు. ఐఎఫ్‌టీయూ నగర అధ్యక్షుడు బి.సోమయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం జేసీని కలిసి వినతిప త్రం అందజేశారు. ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 12:35 AM