ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటా..
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:32 AM
‘ప్రతిష్టాత్మకమైన దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడిచేందుకు అందులో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటా’ అంటూ శ్రీవారి ఆలయ ఈవో ఎన్వీ సత్యన్నారాయణమూర్తి పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ సత్కార సభలో ఈవో మూర్తి
ద్వారకాతిరుమల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ‘ప్రతిష్టాత్మకమైన దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడిచేందుకు అందులో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటా’ అంటూ శ్రీవారి ఆలయ ఈవో ఎన్వీ సత్యన్నారాయణమూర్తి పేర్కొన్నారు. మాధవ కల్యాణ మండప ఆవరణలో ఆయన ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం బుధవారం ఆలయ అనువంశిక ట్రస్టీ ఎస్వీ నివృతరావు అధ్యక్షతన జరిగింది. ఈవో దంపతులను నివృతరావు, అధికారులు సత్కరించగా వేదపండితులు ఆశీర్వాచనం అందించారు. ఈవోగా ఆయన చేసిన అభి వృద్ధిని, కృషిని వక్తలు కొనియాడారు. డిప్యూటీ ఈవో వై.భద్రాజీ, ఈఈ భాస్కర్, ఏఈవోలు, పర్య వేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు.