Share News

ఇదేం విచారణ!

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:39 AM

ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో గతేడాదిజరిగిన నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలజారీ విషయంపై కొత్తకోణం వెలుగుచూసింది..

ఇదేం విచారణ!

సస్పెండైన వారే సహకారులా!.. అర్హతల్లేని వారితో ఎంక్వయిరీనా!

మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నకిలీ ధ్రువీకరణపత్రాల ఫిర్యాదులో కొత్తకోణం

కలెక్టర్‌, డీఎంహెచ్‌వోలను కలిసి తాజాస్థితిని వివరించిన ఫిర్యాదుదారుడు

ఏలూరు అర్బన్‌, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో గతేడాదిజరిగిన నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలజారీ విషయంపై కొత్తకోణం వెలుగుచూసింది.. తాను అందజేసిన ఫిర్యాదుపై నియమించిన విచారణా ధికారి లోపభూయిష్టంగా విధులు నిర్వర్తిస్తున్నా రని ఆరోపిస్తూ, తక్షణమే విచారణాధికారిని, సహ కరిస్తున్న గణాంక, సహాయ గణాంకాధికారులను తొలగించాలని అభ్యర్థిస్తూ కలెక్టర్‌ వెట్రిసెల్వికి ఫిర్యాదు చేసినట్టు ఏలూరుకు చెందిన ఫిర్యాదు దారుడు గళ్లా సునీల్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు అందజేసిన ఫిర్యాదుతో మంగళవారం సాయంత్రం డీఎంహెచ్‌వో డాక్టర్‌ యు.శోభను కలిసి వివరాలను స్థానిక మీడియా కు తెలియజేశారు. ఏలూరు మున్సిపల్‌ కార్పొరే షన్‌లో 145జనన, 19మరణ ధ్రువీకరణ పత్రాల జారీని అన్ని సాక్ష్యాధారాలతో గతేడాది మే 14, 24తేదీల్లో కలెక్టర్‌కు ఫిర్యాదుచేయగా, విచారణకు డీఎంహెచ్‌వోను ఆదేశించారని వివరించారు. విచారణాధికారిగా డీఎంహెచ్‌వో కార్యాలయ ఏవోని అప్పటి జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి నియమించారని తెలిపారు. నిందితులుగా ఉన్న వ్యక్తుల హోదానుబట్టి విచారణాధికారిగా కనీసం డిప్యుటీ సివిల్‌ సర్జన్‌ హోదాకలిగిన వ్యక్తిని నియ మించాల్సిఉండగా, తన ఫిర్యాదుపై విచారణకు నియమించిన వ్యక్తి హోదా తక్కువ స్థాయి కావడం వల్ల విచారణ నిష్పక్షపాతంగా జరుగు తుందన్న నమ్మకంలేదన్నారు. ఇప్పటికే ఒకసారి సస్పెండైన వ్యక్తులనే నకిలీ ధ్రువీకరణ పత్రాల జారీ ఫిర్యాదులో విచారణాధికారికి సహకారు లుగా నియమించడం వల్ల అందరూ కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా జాప్యంచేస్తూ తప్పుదోవప ట్టిస్తున్నారని కలెక్టర్‌కు అందజేసిన ఫిర్యాదులో సునీల్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ భారీ కుంభ కోణంపై సమగ్ర విచారణకు అర్హతలుగల అధికా రిని విచారణాధాకారిగా నియమించడంతోపాటు, స్టాటిస్టికల్‌ అధికారులను తొలగించి, నకిలీ సర్టి ఫికెట్ల జారీకి బాధ్యులైన అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, సంబంధిత నకిలీ సర్టిఫికె ట్లను తక్షణమే రద్దు చేయాలని కోరారు. తన ఫిర్యాదుకాపీలను జనన, మరణాల చీఫ్‌ రిజిస్ట్రా ర్‌కు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీకి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు కూడా పంపినట్టు తెలిపారు.

Updated Date - Apr 01 , 2026 | 12:39 AM