పేదల ఇళ్ల పైకి ఎక్స్‌కవేటర్లు
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:44 AM
క్రాంతినగర్‌లో పేదల ఇళ్లను కూల్చ బోతుంటే స్థానికులు అడ్డుకున్నారు. క్రాంతి నగర్‌లోని ప్రభుత్వ భూమిలో 15సంవత్సరాల క్రితం 90మంది తాత్కాలిక గృహాలు వేసు కుని నివసిస్తున్నారు.
క్రాంతినగర్‌లో ఆందోళనకు దిగిన బాధితులు
ఏలూరు టూటౌన్, ఏప్రిల్ 18 (ఆంధ్ర జ్యోతి): క్రాంతినగర్‌లో పేదల ఇళ్లను కూల్చ బోతుంటే స్థానికులు అడ్డుకున్నారు. క్రాంతి నగర్‌లోని ప్రభుత్వ భూమిలో 15సంవత్సరాల క్రితం 90మంది తాత్కాలిక గృహాలు వేసు కుని నివసిస్తున్నారు. వీటిని తొలగించాల్సిన దిగా కొంతమంది మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. క్రాంతినగర్‌లో ఆక్రమిం చుకుని నిర్మించుకున్న ఇళ్లను మున్సిపల్ అధి కారులు పరిశీలించారు. అనంతరం ఆ స్థలా లను ఖాళీ చేయాలని నోటీసులు పంపారు. అయినప్పటికి తాత్కాలిక గృహాలు తియ్యక పోవడంతో శనివారం నగర పాలక సంస్థ అధికారులు ఎక్స్‌కవేటర్లతో ఇళ్లను కూల్చ డానికి వెళ్లారు. దీంతో ఇళ్లు నిర్మించుకున్న వారంతా ఆందోళనకు దిగారు. చేసేదేమి లేక నగర పాలక సంస్థ అధికారులు వెను తిరిగారు.
పాలకోడేరులో ఆక్రమణలపై సర్వే
పాలకోడేరు, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): పాలకోడేరు గ్రామస్థుల్లో మరోసారి ఆందోళన మొదలైంది. కొన్ని రోజులుగా పంచాయతీ అధికారులు ఆక్రమణలు తొలగిస్తారన్న చర్చ ప్రజల్లో మొదలైంది. అందుకు అనుగుణంగానే పాలకోడేరు పంచాయతీ కార్యదర్శి గోపి గొల్లలకోడేరు బ్రిడ్జి నుంచి పాలకోడేరు పంచాయతీ శివారు వరకు ఉన్న ఆక్రమణలను సర్వే చేపట్టి ఆక్రమణలు తొలగిస్తామని ముందస్తుగానే ప్రచారం చేయించారు. దానిలో భాగంగానే శనివారం పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో సర్వేయర్లు సర్వే చేపట్టారు. దీంతో పాలకోడేరు వాసుల్లో గుబులు మొదలైంది. ఆక్రమణలు ఎప్పుడు తొలగిస్తారో తెలియదుగానీ సర్వే చేపట్టడంతో ప్రజలు చర్చించుకుంటున్నారు.