Share News

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సర్దుబాటు కొలిక్కి

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:56 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, గెజిటెడ్‌ అధికారుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది.

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల  సర్దుబాటు కొలిక్కి
జాయింట్‌ కమిషనర్‌ నాగార్జునరావుకు వినతిపత్రం ఇస్తున్న ఉద్యోగ సంఘ నేతలు

ఈ నెల 15లోగా బదిలీల ప్రక్రియ పూర్తి

ప్రెసిడెన్షియల్‌ ఉత్తర్వులతో సొంత గూటికి

167 మందితో సీనియార్టీ జాబితా

స్థానచలనం తప్పదనే ఆందోళనలో ఉద్యోగ సంఘాల నేతలు

పారదర్శకంగా సర్దుబాటు : జాయింట్‌ కమిషనర్‌ నాగార్జునరావు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, గెజిటెడ్‌ అధికారుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ప్రెసిడెంటియల్‌ ఉత్తర్వులు అమలులో భాగంగా సర్వీసు రూల్స్‌కు సవరణలు చేసి స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తూ, జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ విధానాల్లో బదిలీలను ఈ నెల 15లోగా పూర్తి చేయాలి. అయితే ఉద్యోగ సంఘాల నాయకుల్లో కొందరికి స్థాన చలనం తప్పనిసరి కావడంతో సమీప డివిజన్లలో పోస్టులు దక్కించుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.

2022లో జిల్లాల విభజనలో భాగంగా ఆర్డర్‌ టూ సర్వ్‌తో పలు కేడర్లలో ఉద్యోగులు విజయ వాడ, విశాఖ డివిజన్ల కార్యాలయాల్లో పనిచేస్తు న్నారు. వారంతా వెనక్కి రావడం ఖాయమైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో 167 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని సీనియార్టీ ప్రకారం జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ స్థాయిల్లో సర్దుబాటుకు సీనియార్టీ జాబితాలను సిద్ధం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో ఉమ్మడి జిల్లా ల పరంగా ఏలూరు–1, ఏలూరు–2 జాయింట్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల పరిధిలో పనిచేసే జూనియర్‌, సీనియర్‌ అసి సెంట్లు గతంలో పనిచేసిన స్థానాల్లోకి రావాల్సి ఉంది. దాదాపు 50 మంది వరకు సొంత గూటి కి చేరుకునే అవకాశాలు వున్నట్టు సమాచారం.

సొంత గూటికి ఉద్యోగులు

ఉమ్మడి పశ్చిమ జిల్లాకు చెందిన కొందరు పొరుగు జిల్లాలైన కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో అష్టకష్టాలు పడుతూ నాన్‌లోకల్‌గా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరంతా సొంత గూటికి రావడానికి మార్గం సుగమమైంది. అక్క డ పనిచేసే సబార్డినేట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌లోని ఉద్యోగులు సొంత జిల్లాల్లోని డివిజ న్‌ల్లో వారి స్థానాల్లో చేరనున్నారు. సీనియర్‌ అసిస్టెంట్లు నుంచి జీఎస్టీవోలు జోనల్‌ స్థాయిలో సర్దుబాటు చేయడానికి ఏలూరు, కాకినాడ, రాజమండ్రి జాయింట్‌ కమిషనర్లకు అవకాశం ఉంటుంది. అసిస్టెంట్‌, డిప్యూటీ కమిషనర్లను మల్టీ జోనల్‌ల కింద ఆరు జిల్లాల నుంచి ఎక్కడి నుంచైనా సర్దుబాటు చేయడానికి వీలుంటుంది. ప్రెసిడెంటియల్‌ ఉత్తర్వులు ప్రకారం కొన్ని కేడర్ల ల్లో ఖాళీల భర్తీ జరిగే అవకాశం ఉంది. తాడే పల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెంలో అసి స్టెంట్‌ కమిషనర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి భర్తీ జరిగే ఉంది.

ఊరిని బట్టి మల్టీజోన్‌

జీఎస్‌టీవోలు, గెజిటెడ్‌ హోదా కలిగిన ఉద్యో గులను జోనల్‌ పరిధిలో సర్దుబాటు చేస్తారు. వీరికి స్థానికంగా ప్రాధాన్యత ఉంటుంది. వారిచ్చే ఆప్షన్ల ప్రకారం కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయడానికి కాకినాడ, ఏలూరు, రాజమండ్రి జాయింట్‌ కమిషనర్లు చర్యలు తీసుకోనున్నారు. వీరు పదుల సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. ఊరిని బట్టి మల్టీజోన్‌ పరిధిలో సర్దుబాటు చేస్తారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను పార దర్శకంగా చేపట్టాలని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు జిల్లా జాయింట్‌ కమిషనర్‌ను కలిసి ఇటీవల వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లాలో సీనియార్టీ జాబితాలను పారదర్శకంగా చేపట్టామని, 15వ తేదీలోగా ఉద్యోగుల విభజన ప్రకారం సర్దుబాటు ప్రక్రియ చేస్తామని జాయిం ట్‌ కమిషనర్‌ బి.నాగార్జునరావు తెలిపారు.

తెరవెనుక పైరవీలు

నిబంధనల ప్రకారం సీనియారిటీ ఆధారం గా స్థానచలనం తప్పనిసరి కావడంతో, శాఖలో ఆఫీస్‌ బేరర్లుగా పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల నేతల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే కొనసాగేందుకు, లేదా సమీప డివిజన్లను దక్కించుకునేందుకు కొందరు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, జీఎస్టీవోలు, గెజిటెడ్‌ అధికారులు ఇచ్చే ఆప్షన్ల ఆధారంగా స్థానికతకు ప్రాధాన్యమి స్తూ పారదర్శకంగా బదిలీలు చేపడతామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 12:56 AM