Share News

అక్రమాలకు కేరాఫ్‌!

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:52 AM

గ్రామీణ నీటిపారుదల శాఖ(ఆర్‌డబ్ల్యుఎస్‌)లో ఓ అధికారి వ్యవహార శైలి వివాదాస్పదంగా మా రింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు పోస్టుల్లో కొనసాగుతూ, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు వసూ లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి.

అక్రమాలకు కేరాఫ్‌!

గ్రామీణ నీటిపారుదల శాఖలో అధికారి తీరుపై విమర్శలు

రెండు పోస్టుల్లో తిష్ట.. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు!

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

గ్రామీణ నీటిపారుదల శాఖ(ఆర్‌డబ్ల్యుఎస్‌)లో ఓ అధికారి వ్యవహార శైలి వివాదాస్పదంగా మా రింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు పోస్టుల్లో కొనసాగుతూ, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు వసూ లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. జూనియర్‌ ఇంజనీర్‌ (జేఈ) స్థాయికి చెందిన ఈ అధికారి, జంగారెడ్డిగూడెం డివిజన్‌ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. నిబంధనల ప్రకారం ఆయన ఒకే మండ లానికి పరిమితం కావాల్సి ఉండగా.. తనకున్న పరిచయాలతో ఏకంగా రెండు పోస్టుల్లో (సొంత మండలంతో పాటు మరోచోట) కొనసాగుతున్నా రు. డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఉన్నతా ధికారికి నెలవారీ మామూళ్లు ముట్టజెప్పడం వల్లే ఆయనను ఇలా రెండు పోస్టుల్లో కొనసాగిస్తున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల వద్ద భారీ స్థాయిలో కమీషన్లు తీసుకుంటున్నట్లు, బిల్లులు పాస్‌ చేయాలంటే ఆయనకు వాటా ఇవ్వాల్సిందేనని బాధితులు ఆరోపిస్తున్నారు.

సొంత పనులకే ప్రాధాన్యం

ప్రభుత్వ విధులు పక్కనబెట్టి, సొంత పనుల కు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జేఈ హోదాలో ఉన్న ఆయన.. సొంత మండల కేంద్రంలో దాదాపు 50 ఎకరాలకుపైగా వ్యవసాయం చేస్తూ, ఆ పనుల్లో బిజీగా ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు బిల్లుల సంతకాల కోసం ఆయన పొలం వద్దకే వెళ్లాల్సిన దుస్థితి నెలకొందంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నట్లు సమా చారం. భారీగా ఆదాయం ఆర్జిస్తున్నా పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తన సొంత ఆధార్‌ కార్డును వినియోగిస్తే అక్రమ ఆదాయం గుట్టు రట్టవుతుందనే భయంతో.. ఏకంగా వేరొకరి ఆధార్‌ కార్డు నంబర్‌తో సర్వీస్‌ బుక్‌లో వివరాలు నమోదు చేసి జీతం తీసుకు న్నట్లు ఆరోపణలు న్నాయి. ఈ విషయం బయట కు పొక్కడంతో, ఉన్నతాధికారుల మందలింపుతో ఆ ఆధార్‌ నంబర్‌ మార్చినట్లు సమాచారం.

బినామీ కాంట్రాక్టర్లతో టెండర్లు

జలజీవన్‌ 3.0 పథకం కింద వివిధ మండలా లకు భారీగా నిధులు విడుదలవుతున్న నేపథ్యం లో.. ఆయన కన్ను ఆ నిధులపై పడింది. నేరుగా కాకుండా, తనకు అనుకూలమైన బినామీ కాం ట్రాక్టర్లతో టెండర్లు వేయించి పనులు దక్కించు కుంటున్నట్లు సమాచారం. ఇతర కాంట్రాక్టర్లను ఏమాత్రం గౌరవించని ఈ అధికారి తీరుపై ఉన్న తాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా, వారు మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - Oct 18 , 2026 | 12:52 AM