Share News

మళ్లీ ఆక్రమణల చెర !

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:48 AM

జిల్లా లో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి వివిధ శాఖలు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాయి. కానీ కొంతమంది వ్యాపారులు ఎవరు ఎలా ఏమైతే మాకేమిటంటూ తమ వ్యాపారాలే ముఖ్యమని అడ్డగోలుగా ఆక్రమణలు చేస్తూ రాజకీయ పలుకుబడితో అధికారులను బెదిరి స్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

మళ్లీ ఆక్రమణల చెర !
మళ్ళీ యథావిధిగా రోడ్లను ఆక్రమించి వ్యాపా రాలు

మళ్లీ ఆక్రమణల చెర !

పట్టించుకోని అధికారులు.. నిత్యం ట్రాఫిక్‌ సమస్యే

నేడు రోడ్డు భద్రతా సమీక్ష సమావేశం

ఈ సమస్యను ఉన్నతాధికారులైనా పట్టించుకుంటారా ?

ఏలూరు క్రైం, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): జిల్లా లో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి వివిధ శాఖలు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాయి. కానీ కొంతమంది వ్యాపారులు ఎవరు ఎలా ఏమైతే మాకేమిటంటూ తమ వ్యాపారాలే ముఖ్యమని అడ్డగోలుగా ఆక్రమణలు చేస్తూ రాజకీయ పలుకుబడితో అధికారులను బెదిరి స్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా కలె క్టరే ఆక్రమణలు తొలగించినా ఆయన బదిలీ కాగానే యఽథేచ్ఛగా ఒకరు తరువాత ఒకరు తాము ఫలానా రాజకీయ పార్టీ వారమంటూ మళ్ళీ యథావిధిగా రోడ్లను ఆక్రమించి వ్యాపా రాలు కొనసాగించడంతో ట్రాఫిక్‌ సమస్య జఠిల మైంది. ప్రతి నెలా ట్రాఫిక్‌ సమీక్షా సమావేశా లు జరుగుతున్నా ఈ సమస్యలను ఉన్నతాధి కారుల దృష్టికి రానీయకుండా కొందరు కింది స్థాయి అధికారులు జాగ్రత్త పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ముఖ్యంగా పోలీసు, ఆర్‌అండ్‌ బీ, రవాణాశాఖ అధికారులు రోడ్లను పరిశీలిం చి ఎక్కడెక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతు న్నాయో ఆ ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించి నివారణ కోసం ఏమి చర్యలు చేపట్టాలో ఆ దిశగా చర్యలు తీసుకుంటు న్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు సమీపంలోనే నగరానికి లోపలకు వచ్చే అన్ని రోడ్లు ఆక్ర మణలదారుల కబంధహస్తాల్లోనే ఉండి పోయాయి.

గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ప్రసన్న వెంకటేశ్‌ ఏలూరు నుంచి ఆశ్రం వైపు ఉదయం పూట కారులో వెళ్తుండగా ఆశ్రం జంక్షన్‌ వద్ద 20 నిముషాలు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు. ఈ సమస్యకు కారణమేమిటని అధి కారులను అడిగి తెలుసుకుని స్వయంగా పరి శీలించారు. ఆశ్రం జంక్షన్‌ వద్ద రోడ్లను ఆక్ర మించి వ్యాపారాలు కొనసాగించడంతో ఆ వ్యాపారుల వద్దకు వాహనదారులు వచ్చి తమ కార్లు, బైక్‌లు ఆపడం వల్ల నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుందని, రోజూ ఇక్కడ ఈ సమస్య మామూలేనంటూ చాలా తేలిగా కొంత మంది అధికారులు చెప్పగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే వాటిని తొలగించా లంటూ ఆదేశాలు ఇచ్చి రెవెన్యూ, పోలీసు, ఆర్‌ అండ్‌బీ అధికారుల ద్వారా పూర్తిగా తొలగిం చారు. ఆయన బదిలీ కాగానే ఒక్కొక్క వ్యాపారి నెమ్మది నెమ్మదిగా తమ వ్యాపారాలను మొద లు పెట్టడంతో ట్రాఫిక్‌ సమస్య మళ్ళీ జఠిల మైంది. ఆశ్రం జంక్షన్‌ వద్ద సర్వీసు రోడ్డులో ఉన్న వ్యాపార దుకాణాలను గతనెల 23తేదీన తొలగించారు. అయితే నగరంలోకి వచ్చే మార్గంలో మాత్రం తొలగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ ఆక్రమించి షాపులు పెట్టిన వారు అద్దెలకు కూడా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నేడు జరిగే రోడ్డు భద్రత సమీక్షా సమావేశంలో అధి కారులు నగరంలోకి ప్రవేశించే మార్గాలలో ఆక్ర మణలను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం వైపు నుంచే వచ్చే రోడ్డులోనే ఎక్కువ ఆక్రమణ లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 25 , 2026 | 12:48 AM