జిల్లా ఓటర్లు 15,41,651
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:00 AM
జిల్లా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్) ప్రక్రియలో కీలక ఘట్టం ముసాయిదా జాబితాల విడుదల శుక్రవారం చేపట్టారు.
ఈనెలాఖరు వరకు అభ్యంతరాల స్వీకరణ
జిల్లాలో తగ్గిన ఓటర్లు 1,02,541
ఏలూరు, జూలై31 (ఆంధ్రజ్యోతి):జిల్లా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్) ప్రక్రియలో కీలక ఘట్టం ముసాయిదా జాబితాల విడుదల శుక్రవారం చేపట్టారు. కలెక్టర్ వెట్రిసెల్వి వివిధ రాజకీయ పక్షాలకు ఈ జాబితాలను పెన్‌డ్రైవ్‌లో అందజేశారు. సర్ ప్రక్రియతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 15లక్షల41,651 మందిగా తేలింది. సర్వీసు ఓటర్లు 626 మందిగా నిర్ధారించారు. ఓటర్ల జాబితా సవరణకు ముందు జిల్లాలో 16లక్షల44వేల193 మంది ఓటర్లు ఉన్నారు. కాగా చనిపోయిన, డబుల్ ఎంట్రీ, అందు బాటులో లేని ఓటర్ల సంఖ్య 1,02,542 మంది. అయితే ఈ నెలా ఖరు వరకు పోలింగ్ కేంద్రాల వారీగా, సచివాలయాల పరిధిలో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. పేర్లు, ఇంటి పేర్లు ఇతరత్రా తప్పుగా నమోదైన వాటిపై ఓటర్ల తగు ఆధారాలతో అభ్యంతరాలను వెల్లిబుచ్చాలి. దానికి అనుగుణంగా మార్పులతో కూడిన తుది జాబితాలను అక్టోబరు 3న ఎన్నికల సంఘం విడు దల చేయనుంది.