Share News

చివరిలోను.. అదే రభస!

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:41 AM

అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాల నడుమ కౌన్సిల్‌ చివరి సమావేశం రసాభాసగా సాగింది. నగరపాలక సంస్థ పాలక మండలి సర్వసభ్య సమావేశం మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ అధ్యక్షతన గురువారం కౌన్సిల్‌ హాలులో జరిగింది.

చివరిలోను.. అదే రభస!
కౌన్సిల్‌ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదం..

ప్రతిపక్షవైసీపీ సభ్యులు పదేపదే అభ్యంతరాలు

నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణ

ఖండించిన మేయర్‌.. కమిషనర్‌

రసాభాసగా చివరి కౌన్సిల్‌ సమావేశం.. ఈనెలాఖరుతో పాలకవర్గం పదవీకాలం పూర్తి

ఏలూరు టూటౌన్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాల నడుమ కౌన్సిల్‌ చివరి సమావేశం రసాభాసగా సాగింది. నగరపాలక సంస్థ పాలక మండలి సర్వసభ్య సమావేశం మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ అధ్యక్షతన గురువారం కౌన్సిల్‌ హాలులో జరిగింది. అజెం డాలో 17 అంశాలను ప్రవేశపెట్టగా వాటిని కౌన్సిల్‌ ఆమోదించింది. గతేడాది డిసెంబరు 2న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అజెండాలోని 18 అంశాల ప్రోసిండింగ్స్‌ను ధ్రువీకరించారు. అజెం డాలోని అంశాలను సూపరింటెండెంట్‌ సిరాజు ద్దీన్‌ చదివి వినిపిస్తుండగా ప్రతిపక్షవైసీపీ సభ్యులు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేయ డంతో మేయర్‌ అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షవైసీపీ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్‌ గుడిదేసి శ్రీనివాస్‌, విజయనిర్మల, కేదా రేశ్వరి, జ్యోతి మాట్లాడుతూ తమ డివిజన్లలో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి నిధులు కేటాయిం చడం లేదని, కేవలం అధికార పార్టీ సభ్యుల డివిజన్లలోనే అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నా రని ఆరోపించారు. దీనికి మేయర్‌ సమాధానం ఇస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే భేదం లేదని ఎక్కడ అవసరమైతే అక్కడ రోడ్ల, డ్రెయి న్ల నిర్మాణం, అభివృద్ధికి ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తున్నామన్నారు. వైసీపీ నూత న కార్యాలయానికి కరెంటు ఇవ్వడం లేదని, నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తు న్నారని వైసీపీ సభ్యులు ఆరోపించగా కమిషనర్‌ భానుప్రతాప్‌ సమాధానం ఇస్తూ వైసీపీ కార్యా లయానికి అసలు ప్లాన్‌ అప్రూవల్‌ కాలేదని, చట్టబద్ధమైన నిర్మాణాలకే కరెంటు ఇస్తామని, ఇతర సదుపాయాలు కల్పిస్తామ న్నారు. మేకల కబేలాలో మాంసాన్ని పరీక్షించడానికి నియమిం చిన డాక్టర్‌ జి.వెంకయ్య విధులు సరిగా నిర్వ హించడం లేదని అతని సేవలు కొనసాగించ డానికి వీలులేదని, ఇప్పటి వరకు అతను తీసుకున్న జీతాన్ని రికవరీ చేయాలని కోఅప్షన్‌ సభ్యుడు ఎస్‌ఎంఆర్‌.పెదబాబు అభ్యంతరం లేవనెత్తారు. కాగా ప్రసుత్త కౌన్సిల్‌ 2021, జూలై 30న కౌన్సిల్‌ ఏర్పాటవ్వగా ఈనెలాఖరుతో పాలకవర్గ గడువు ముగుస్తోంది. సమావేశం అనంతరం సభ్యులంతా గ్రూప్‌ఫొటో దిగారు.

రూ.750 కోట్లతో అభివృద్ధి..

గత ఐదేళ్లలో రూ.750 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశాం. 15వ ఆర్థిక సంఘం నిధులు అమృత్‌ నిధులతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. 499 కిలోమీటర్ల మేర రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాం. రెండు పూటలా నగర ప్రజలకు తాగునీరందించాం. పారిశుధ్యం మెరుగుపడింది. జూట్‌మిల్లు వద్ద వంతెన నిర్మాణం పూర్తి చేశాం. శనివారపుపేట కాజ్‌వే నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుంది. పవర్‌ పేట రైల్వేగేటు వద్ద ఫ్లయ్‌ఓవర్‌ నిర్మాణానికి అనుమతులు పూర్తయ్యాయి. నగర అభి వృద్ధి లో ఎమ్మెల్యే చంటి సహకారం ఎంతో వుంది. అధికారులు, పాలకవర్గం సహక రించారు.

– మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌

అజెండాలోని అంశాలు

గత కౌన్సిల్‌ సమావేశంలో 18 అంశాలను ధ్రువీకరించారు

ఏపీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.2కోట్లతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం

15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10 కోట్లతో నగరంలో రోడ్లు, అభివృద్ధి పనులు

టీడీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి 1.61 ఎకరాలు కేటాయింపు

థర్డ్‌పార్టీ క్వాలిటీ ఏజన్సీ కాంట్రాక్టు ఏడాది పొడిగింపు

మేకల కబేలా నిర్వహించడానికి డాక్టర్‌ జి.వెంకయ్య సేవలు కొనసాగింపు

రెండు సూపరింటెండెంట్‌ పోస్టులు, ఒక అకౌంటెంట్‌ పోస్టు ప్రమోషన్లపై భర్తీ

రెవెన్యూ ఆఫీసర్‌ ఎన్‌వీ.భాస్కర్‌కు రెండు ఇంక్రీమెంట్లు పునరుద్ధరణ

ఆఫీస్‌ సబార్డినేట్‌ ఎంవీ.కాశీవిశ్వనాథంను తణుకు మున్సిపాల్టీకి బదిలీ

మున్సిపల్‌ పాఠశాలల్లో స్వీపర్లకు మరో రూ.4వేలు జీతం పెంపు

నవజ్యోతి సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపునకు 373 గజాల స్థలం కేటాయింపు

ఉపాధ్యాయులకు పీఎఫ్‌ చెల్లించడానికి అంగీకారం

ఫిల్టర్‌బెడ్‌ ఆపరేటర్‌ మణికంఠకు వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్‌

వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న డి.అజయ్‌కుమార్‌కు టెక్నికల్‌ ఆఫీసర్‌గా పదోన్నతి

నగరంలో విలీనమైన వెంకటాపురానికి వీధిలైట్లు, ఎలక్ర్టికల్‌ పోల్స్‌ ఏర్పాటు

గులాబీ తోటలో లేఅవుట్లకు కరెంటు ఇవ్వడం

వెంకటాపురంలో లేఅవుట్‌కు కరెంటు కనెక్షన్‌, వీధి దీపాల ఏర్పాటు.

Updated Date - Jul 17 , 2026 | 12:41 AM