ఎల్‌నినో ఎఫెక్ట్..15 మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:37 AM
జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు.
జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఇన్‌చార్జి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం విత్తన కిట్లు అందజేస్తుందని మంత్రి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిందని అధికారులు వివరించడంతో రైతులను ముందస్తుగా ఎందుకు అప్రమత్తం చేయలేదని మంత్రి ప్రశ్నించారు. 42 వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 32 రకాల విత్తనాలు సబ్సిడీపై అందించ డానికి అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులకు వాస్తవ పరిస్థితులు వివరించి అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. జిల్లాలో తాగునీటి సరఫరా, ఏలూరులో పారిశుధ్యం నిర్వహణపై సమీక్షించారు.
ఏలూరు,ఆగస్టు 4(ఆంరఽఽధజ్యోతి): జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 15 మండ లాల్లో ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వం ప్రోత్సహి స్తుంది, దాదాపు 40 వేల మంది రైతులకు పీఎండీఎస్ కిట్లు (32 రకాలు విత్తనాలు) పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంత్రి నాదెండ్ల అఽధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశం మంగళవారం జరిగింది. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, వివిధ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, ఇటీవల వరదల సమయంలో సహాయ కార్యక్రమాలపై సమీక్షిం చారు. వ్యవసాయశాఖ జేడీ ఎస్‌కే హబీబ్ బాషా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వివరించారు. జిల్లాలో 34 శాతం సాధారణ వర్షపాతం నమోదైందని, 2 లక్షల ఎకరాల్లో వరి సాగుకు లక్ష ఎకరాల్లో నాట్లు పడ్డాయ న్నారు. వర్షాభావ పరిస్థితులపై రైతులను ముందస్తుగా అప్రమత్తం చేయలేదా అని మంత్రి ప్రశ్నించారు. ముదినేపల్లిలో ప్లస్ 25 వర్షపాతం నమోదు కాగా 4 మండలాల్లో సాధారణ వర్షపాతం ఉందని, 15 మండలాల్లో 50 శాతం కంటే తక్కువగా నమోదైందని జేడీ వివరించారు. ఇప్పుడు కొంత వర్షాలు పడుతున్న దృష్ట్యా మరో 11 రోజులు వర్షాలు కురిస్తే వరి సాగుకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలుగా 42వేల ఎకరాల్లో అపరాలు, ఉలవలు, ఇతర పంటలు వేసే దిశగా 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించడానికి ఇండెంట్ పెట్టామని తెలిపారు. ఉద్యాన పంటలపై ఆ శాఖ పీడీ సాజానాయక్ వివరిస్తూ ఉద్యాన పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. మంత్రి నాదెండ్ల మాట్లాడు తూ రైతులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే పంటలు సాగు చేయాలని, ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడం, వర్షాభావం వలన పంటలు నష్టపోకుం డా ఆరుతడి పంటలు వైపు సాగాలని సూచించారు. అందరి రైతులతో పంటల బీమాలో నమోదయ్యేలా ప్రజాప్రతినిధులు సహకారంతో ముందుకు సాగాల న్నారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లో ముందుగా తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని, శివారు ప్రాంతాలకు సైతం తాగు నీరు అందాలని, అనంతరమే మిగులు జలాలను సాగుకు వినియోగించాలన్నారు.
అధికారులు సీరియస్‌గా పనిచేయాలి
డీఆర్సీ సమావేశాల్లో వివిఽధ అంశాలపై నిర్థేశిత లక్ష్యా లను చేరుకునేలా అధికారులు సీరియస్‌గా పనిచేయా లని, ప్రజాప్రతినిధులు సహకారంతోనే కార్యక్రమాలు, పథకాలు విజయవంతం అవుతాయని మంత్రి నాదెండ్ల సూచించారు. ఏలూరులో పారిశుధ్యం మెరుగుపర్చక పోతే చర్యలు తీసుకుంటానని కమిషనర్ భానుప్రతాప్ ను మంత్రి హెచ్చరించారు. నగరంలో ఎక్కడా పారిశు ధ్యం మెరుగుపడలేదన్నారు. ఆసుపత్రి పరిసరాల్లో డ్రె యిన్లు 48 గంటల్లో శుభ్రం చేయించాలని ఆదేశించారు.
ఇళ్ల సమస్యలపై గొంతెత్తిన ఎమ్మెల్యేలు
పైడిచింతపాడులో పేదల ఇళ్ల నిర్మాణంలో కాంట్రా క్టర్ నుంచి రెవెన్యూ రికవరీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని, 2014–19 సమయంలో ఎన్టీఆర్ గృహనిర్మాణం పథకం కింద నిర్మించుకున్న ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. తన నియోజకవర్గంలో 3,898 ఇళ్లు మంజూరు చేశారని, ఇందులో 2,791 మందికి పట్టాలు ఇచ్చారు. ఇంకా 1100 మందికి పట్టాలు ఎందుకు రాలేదో అర్థం కావడం లేదని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో ఇళ్లు నిర్మించుకోని వారి పట్టాలు రద్దు చేసి కొత్తవారికి ఇవ్వాలని సూచించినా ఇప్పటికి పనులు ముందుకు సాగలేదని ఎమ్మెల్యే బడేటి చంటి మంత్రికి వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్ కుమార్‌రెడ్డి, డీసీఎంఎస్ చెర్మన్ చాగంటి మురళీకృష్ణ, ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, వడ్డీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు.